ఎన్టిఆర్, హన్సిక జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన 'కంత్రి' సినిమాని తమిళ హీరో విజయ్ చూసాడట. తను హీరోగా తమిళంలోకి రీమేక్ చేయాలని ముచ్చట పడుతున్నాడట. రెగ్యులర్ గా విజయ్ దాదాపు ప్రతి క్రేజి తెలుగు సినిమా రిలీజుకి తప్పని సరిగా హైదరాబాద్ లో వాలతాడు. మార్నింగ్ షో చూసి సినిమా నచ్చితే తన నిర్మాతలని తమిళ రైట్స్ కోసం పంపుతూంటాడు. ఆ వరసలోనే మహేష్ బాబు 'ఒక్కడు' సినిమాని 'గిల్లి' పేరుతో రీమేక్ చేసి సంచలన విజయం సాధించారు. అలాగే 'పోకిరి' తమిళ వెర్షన్ సాధించిన ఘన విజయం కూడా విజయ్ కు తెలుగు సినిమాలపై ఈ తరహా ఆసక్తి మరీ పెంచింది. దాంతో తమిళంలో అందరి హీరోల కన్నా ఎక్కువ తెలుగు రీమేక్ లు చేసిన ఘనత ఆయనకే దక్కింది. అందులోనూ 'బొమ్మరిల్లు, ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే' చిత్రాలు అక్కడ రీమేకై హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తున్నాయి. కాబట్టి కంత్రి సినిమా గ్యారింటీగా రీమేక్ అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.