twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవుళ్ళతో పోల్చద్దంటూ స్టార్ హీరో హెచ్చరిక

    By Srikanya
    |

    నన్ను దేవుళ్ళతో పోల్చుతూ పోస్టర్లు పెట్టవద్దని ఈ సందర్భంగా అభిమానుల్ని కోరుతున్నాను. ఇకపై ఇలా చేస్తే సదరు వ్యక్తులపై కఠిన చర్యలుంటాయి'' అని తమిళ హీరో విజయ్ హెచ్చరించాడు. మదురైలో ఏర్పాటు చేసిన విజయ్‌ తాజా చిత్రం 'వేలాయుధం' సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో భాగంగా అభిమానులు ఈ హీరోను దేవునిగా చూపిస్తూ పోస్టర్లు రూపొందించి వేదిక దగ్గర ప్రదర్శించారు. దీంతో మీడియా నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఒక పక్ష పత్రికలో పెద్ద కథనమే వచ్చింది. ఇక తాను మాట్లాడకపోతే బాగోదనుకున్న విజయ్‌ ఆ రోజున ఏం జరిగిందో వివరించాడు. ''అభిమానుల కోలాహలం మధ్య మదురైలో ఈ మధ్య నా వేలాయుధం సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నా పేరిట నెలకొల్పిన 'మక్కళ్‌ ఇయక్కం' ద్వారా పేదలకు, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారికి పలు కానుకలివ్వడం జరిగింది.

    అయితే, నా పట్ల అపార ప్రేమాభిమానాలు గల నా అభిమానులు కొందరు నన్ను దేవునిగా చూపిస్తూ అక్కడ పోస్టర్లు పెట్టడం నా దృష్టికి వచ్చింది. నేను వెంటనే వారిని పిలిచి ఇకపై తనను ఇలా చూపుతూ పోస్టర్లు పెట్టవద్దని స్పష్టంగా చెప్పాను. అక్కడ పెట్టిన పోస్టర్లను వెంటనే తీసేయాలన్న నా విజ్ఞప్తిని మన్నించి వాటిని తొలగించారు'' అని విజయ్‌ వివరణ ఇచ్చాడు. ఈ వ్యవహారం అప్పుడే ముగిసినప్పటికీ కొందరు మాత్రం దీనిని ఇంకా పెద్ద గొడవగా చెయ్యాలనుకుంటున్నారని ఈ నటుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ''నేను ఏ విషయాన్నయినా కులమతాలకు అతీతంగా చూస్తాను. మానవతా విలువల్ని గౌరవిస్తాను. మదురై కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు 40 కంప్యూటర్లు విరాళంగా ఇచ్చాను. పేదలకు ఆవులు, టైలరింగ్‌ మిషన్లు ఇచ్చాం. ఇవేగాక రాష్ట్రంలో 1000 మంది విద్యార్థుల చదువులకు తోడ్పాటు ఇస్తున్నాను. వీరంతా ఏ కులంవారో, ఏ మతం వారో నాకు తెలీదు. ఇదే నా అభిమానులకూ వర్తిస్తుంది. మాదంతా తమిళ జాతి అని మాత్రమే నాకు తెలుసు'' అన్నాడు.

    English summary
    Vijay was not happy with his fans during the audio launch function of Velayudham. The actor was angry after he was depicted like god in some posters in Madurai by his followers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X