మహేష్ కి ఫోన్ చేసి మరీ తమిళ హీరో
మహేష్ బాబు తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ రీసెంట్ గా 50 రోజులు పూర్తైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమిళ స్టార్ హీరో మహష్ కి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. కాస్సేపు కుశల ప్రశ్నలు అయ్యాక మహేష్ ..విజయ్ చిత్రం తుపాకి గురించి అడిగినట్లు తమిళ పత్రికలు రాసుకొచ్చాయి. మురగదాస్ ఎట్లా ఆ సినిమా ని హ్యాండిల్ చేస్తున్నారో అడిగారు. అంతేగాక నన్బన్ చిత్రం (తెలుగు స్నేహితుడు) యాభై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ సైతం శుభాకాంక్షలు తెలియచేసారు.
మహేష్ బాబు, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చి విజయవంతమైన చిత్రం బిజినెస్ మ్యాన్. రెండు వేల ధియోటర్స్ తో ప్రపంచమంతా భారీగా విడుదలైన ఈ చిత్రం మార్చి 2 వ తేదికి యాభై రోజులు పూర్తి చేసుకుంటుంది. 50 రోజులకు రాష్ట్రంలో 70 సెంటర్లలో సినిమా స్టిల్ రన్ ఉంది. వీకెండ్ లలో మంచి కలెక్షన్స్ తెచ్చిపెడుతూండటంతో సినిమాని ఎగ్జిబిటర్స్ కంటిన్యూ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











