అమ్మో... అంతే: ఫైట్ సీన్ కి రూ.కోటి!

By Srikanya

చెన్నై : సినిమా కాస్టలీగా కనపడి రంజింపచేయాలంటే ఖర్చు తప్పదు. తాజాగా అటువంటి ఖర్చు ని తమిళ ఇండస్ట్రీ పెట్టడానికి సాహసిస్తోంది. కెప్టెన్‌ విజయకాంత్‌ కుమారుడు షణ్ముగపాండియన్‌ నటిస్తున్న చిత్రం 'శతాబ్దం'. పొల్లాచ్చి, కొయంబత్తూరులో కీలక ఘట్టాలను తెరకెక్కించారు. ప్రస్తుతం ఫైట్ సీన్ ను, పాటలను మలేషియాలో చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఓ ఫైట్ సీన్ కోసం రూ.కోటి వెచ్చించింది చిత్ర యూనిట్‌.

బోట్‌ ఛేజింగ్‌లా సాగే ఈ సన్నివేశంలో 200 మంది జూనియర్‌ ఆర్టిస్టులు పాలుపంచుకున్నట్లు సమాచారం. ఈ ఫైట్‌ను ఐదు కెమెరాలతో చిత్రీకరించారు. నాలుగు రోజులపాటు తెరకెక్కిన ఈ ఘట్టానికి థాయ్‌లాండ్‌కు చెందిన కిచ్చా స్టంట్‌ మాస్టర్‌గా వ్యవహరించారు. ఇందులో షణ్ముగ పాండియన్‌కు జంటగా నేహా, సుబ్రా అయ్యప్ప పరిచయం అవుతున్నారు. సింగంపులి, జగన్‌, పవర్‌స్టార్‌, దేవయాని, రంజిత్‌ తదితరులు నటిస్తున్నారు.
మరిన్ని విశేషాలు ఈ చిత్రం గురించి...

విజయకాంత్‌ కుమారుడు షణ్ముగపాండియన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'శతాబ్దం'. ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. విజయకాంత్ చాలా కాలంగా వెండితెరకు పూర్తి దూరంగా ఉండి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే చిరకాలం తర్వాత ఆయన పాత్ర చేయనుండటంతో ఆ క్రేజ్ తప్పకుండా సినిమాకు యాడ్ అవుతుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు.

Vijayakanth’s Son Shanmuga Pandian Debuts In Sagaptham

సింగంపులి, జగన్‌, పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌, తలైవాసల్‌ విజయ్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో శింబు ఒక పాట కూడా పాడారు. చిత్రంలో విజయ్‌కాంత్‌ గెస్ట్‌రోల్‌ను పోషించనున్నట్లు సమాచారం. తన కుమారుడి పరిచయ చిత్రంలో పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారట కెప్టెన్‌. యాక్షన్‌ ప్రియులను ఆకట్టుకునే రీతిలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. కార్తీక్‌రాజా సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ చిత్రాన్ని విజయకాంత్‌ ఆయన బావమరిది ఎల్‌కే సుధీష్‌ నిర్మిస్తున్నారు. తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ పొల్లాచ్చి, ఆలియర్‌డ్యాం, వాల్పారై, ఆనైమలై ప్రాంతాల్లో తెరకెక్కించారు. తర్వాత కుంభకోణంలో 20 రోజుల పాటు చిత్రీకరించారు.

అక్కడ రూ.కోటితో భారీ సెట్‌ వేసి ఆరు రోజులపాటు ఓ పాటను తెరకెక్కించారు. ఇందులో షణ్ముగపాండియన్‌, నేహా నటించారు. ప్రస్తుతం మూడో షెడ్యూల్‌ చిత్రీకరణ మలేషియాలో జరుగుతోంది. కౌలాలంపూర్‌, లంగావి, బ్యాంకాక్‌లో 35 రోజులపాటు చిత్రీకరించనున్నారు. మిస్‌ఇండియా నేహా, బెంగళూరు మోడల్‌ శుబ్ర అయ్యప్ప హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X