»   » దర్శకునిపై రేప్ కేసు పెట్టిన యాక్టర్ విజయలక్ష్మి...!?

దర్శకునిపై రేప్ కేసు పెట్టిన యాక్టర్ విజయలక్ష్మి...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

యాక్షన్ హీరో అర్జున్, జగపతి బాబు మల్టీస్టారర్ గా నటించిన చిత్రం 'హనుమాన్ జంక్షన్" చిత్రంలో హీరోస్ కి చెల్లిగా నటించిన విజయలక్ష్మి ప్రేక్షకులకు సుపరిచితురాలు..తమిళ దర్శకుడు సీమన్, విజయలక్ష్మిల మధ్య వచ్చిన విబేధాలు పోలీస్ కేసు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. తనతో మూడేళ్లు సహజీవనం చేసి ఇప్పుడు వేరే పెళ్లి చేసుకోవాలని చూస్తున్నసీమన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు విజయలక్ష్మి తీర్మానించుకుంది. అందుకే సీమన్ తనతో క్లోజ్ గా ఉన్న ఫోటోలు, వీడియోలతో సహా పోలీసులకి అందజేసి అతను తనని మోసం చేశాడని కేసు పెట్టింది.

నాలుగైదు స్ట్రాంగ్ కేసులతో గట్టిగా ఎటాక్ చేసింది. ఇదంతా రాజకీయంగా తనని దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్ర అంటూ సీమన్ లబోదిబోమంటున్నాడు. విజయలక్ష్మి ఆరోపణల్లో నిజం లేదని అంటూ అయిదు కోట్ల రూపాయలకి ఆమెపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిస్తున్నాడు. అయితే విజయలక్ష్మి పకడ్బందీగా కేసు పెట్టడంతో సీమన్ అరెస్ట్ ఖాయమని కోలివుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary
Actress Vijayalakshmi has lodged a complaint on Wednesday against Tamil director Seeman, the chief co-ordinator of Naam Thamizhar Iyakkam (NTI). In her four page complaint Vijayalakshmi has said that she was having a close relationship with Seeman for three years, who is now refusing to marry her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu