మేమిక ఫైట్స్ కంపోజ్ చెయ్యం.. :.విజయన్ మాస్టర్
ఈ విషయమై సంఘం అధ్యక్షులు విజయన్ మాస్టర్ మాట్లాడుతూ.. ప్రాణాలను సైతం త్వజించి, మంచి పోరాట సన్నివేశాల కోసం శ్రమించే తమ కళాకారులకు పరిశ్రమలో తగిన న్యాయం జరగడంలేదన్నారు. పొరుగు రాష్ట్రాల్లో తమ పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. ఆంధ్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో చిత్రీకరణ నిర్వహిస్తే.. ఆ రాష్ట్ర కళాకారులు సగం, తాము సగం మంది నటించేలా గతంలో ఓ ఒప్పందం ఉండేదని అన్నారు.
కానీ ప్రస్తుతం 25 శాతం కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదని, దీంతో ఒకరిద్దరు మాత్రమే నటించాల్సి వస్తోందన్నారు. దీనివల్ల తమ సంఘంలోని 577 మంది సభ్యుల కుటుంబాలు వీధినపడే అవకాముందని అన్నారు. ఈ విషయంపై తమ అధిష్టాన ఫెడరేషన్ అయిన 'ఫెప్సీ' ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఫెప్సీ అధ్యక్షుడు శివ తమ సంఘానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
తాజా ఒప్పంద వ్యవహారంపై అఖిల భారత సంఘం తీసుకొచ్చిన తీర్మానాన్ని కూడా వారు తమకు చెప్పలేదని వాపోయారు. ఫెప్సీ అధ్యక్షుడిని మార్చేంత వరకు తాము ఆ ఫెడరేషన్ నుంచి దూరంగా ఉంటామని, ఏ చిత్రాల్లోనూ నటించబోమని విజయన్ తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో గతంలో మాదిరిగా పనిచేసేలా ఆయా రాష్ట్రాల నుంచి తమకు తగిన న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.


Click it and Unblock the Notifications












