The GOAT: ది గోట్ మూవీలో విజయ్ కారు నంబర్ గుర్తించారా? సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా!
సౌత్ ఇండియా సినిమా దగ్గర ఎనలేని జనాదరణ ఉన్న హీరోలు చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు. ఇలా మన తెలుగు సినిమాలో కూడా కొంతమంది స్టార్ హీరోస్ ఉంటే సినిమా దగ్గర కూడా కొందరు ఉన్నారు. ఇలా ఉన్న బిగ్ స్టార్స్ లో కొందరు రాజకీయాల్లోకి కూడా వచ్చారు. అయితే సినీ నటులు రాజకీయాల్లోకి రావడం అనేది ఇప్పుడు నుంచే కాదు ఎప్పుడు నుంచో ఉన్న సంగతి తెలిసిందే.
అలా వచ్చిన కొందరు దిగ్గజ హీరోలు సీఎం లు కూడా అయ్యారు. కానీ ప్రెజెంట్ జెనరేషన్ లో పరిస్థితులు అలా లేవని చెప్పాలి. మీడియా వాడకం కానీ తిమ్మిని బమ్మి చేయడంలో ఇపుడు ట్రెండ్ అడ్వాన్స్ గా ఉంది. సో ఎంత భారీ క్రేజ్ ఉన్నా కూడా రాజకీయాల్లో రాణించడం అనేది అంత సులభం కాదని మన తెలుగు స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ఒక ఉదాహరణగా చూపించారు.

కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడానికి పడ్డ కష్టం ఏంటో తన ఫ్యాన్స్ కి తెలుసు. అయితే ఒక పదవిని ఆశించడం దానిని ఎలా పొందాలి అనేది రాజకీయాల్లో సినిమాల్లో ముందే ఇన్ డైరెక్ట్ గా ఇంకా ఇంకా పోటీ కూడా చెయ్యకుండానే తనని తాను సీఎం గా ఓ బిగ్ స్టార్ ప్రొజెక్ట్ చేసుకుంటే ఎంత వెటకారంగా, పైత్యంగా అనిపిస్తుంది? ఇప్పుడు సరిగ్గా ఇదే దళపతి విజయ్ చేసుకున్నాడు.
ప్రస్తుతం విజయ్ తమిళనాట పార్టీ పెట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా కూడా ప్రకటించాడు. గత కొన్ని రోజులు కితమే తన పార్ట్ జెండాని కూడా ఆవిష్కారించాడు. సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ పొలిటికల్ గా ఏదన్నా మీటింగ్ లో అభిమానులకి ఒక రాజకీయ నాయకుడిలా సీఎం అవుతాను అన్నట్టు చెప్పుకుంటే బాగుంటుంది కానీ..
సినిమాలో డైరెక్ట్ గా నేనే సీఎం అని చెప్పుకోవడం నేడు తన భారీ సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం (ది గోట్) సినిమా చూసిన వారికి అర్ధం అవుతుంది, కాగా ఈ చిత్రంలో విజయ్ నడిపే కార్ నెంబర్ ప్లేట్ చర్చగా మారింది ఇందులో తన కార్ నెంబర్ ప్లేట్ ఏమని ఉంటుంది అంటే "TN CM 2026" అన్నట్టు చూపించారు. అంటే 2026 లో జరిగే ఎన్నికల్లో తమిళ నాడు సీఎం గా విజయ్ ఈ సినిమాలో ముందే చెప్పేసుకున్నాడు.

ఇది మాత్రం సినిమా చూసిన వాళ్ళకి ఒకింత ఓవర్ గానే అనిపించింది అని అంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో విజయ్ పై మామూలు ట్రోల్స్ పడవు అలాంటప్పుడు ఇలాంటి పైత్యంతో కూడిన పనులు చేస్తే అసలే ఊరుకోరు. మరి ఇది విజయ్ కావాలనే చేయించుకున్నాడో లేదా దర్శకుడు ఐడియానో కానీ ఎఫెక్ట్ మాత్రం ఎక్కువ విజయ్ పైనే పడుతుంది.
ఇప్పుడు ఇలా వేసుకొని ఒకవేళ 2026 లో కానీ ఓడిపోతే ఇది చూపించి భారీ లెవెల్లో నెటిజన్స్ ట్రోల్స్ చేసి తీరుతారు. మరి ఇలాంటి విషయాల్లో అంతపెద్ద స్టార్డం ఉన్న విజయ్ ఇంత సిల్లీగా ఆలోచించడం అనేది కొంచెం ఆశ్చర్యకరమే అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











