Ghilli Vs Thunivu: గిల్లీ వర్సెస్ తనివు బాక్సాఫీస్ వార్.. రీ రిలీజ్‌తో విజయ్, అజిత్ నువ్వా? నేనా?
తమిళ సూపర్ స్టార్స్ దళపతి విజయ్, తలా అజిత్ కుమార్ మరోసారి బాక్సాఫీస్ వద్ద భారీ పోరుకు సిద్దమయ్యారు. అయితే వీరు నటించిన లేటేస్ట్ సినిమాలతో కాకుండా గతంలో రిలీజైన చిత్రాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్టార్ హీరోల మధ్య ఎప్పటి నుంచే బాక్సాఫీస్ వద్ద వైరం కొనసాగుతూనే ఉంది. ఈ ఫైట్ ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల వరకు వచ్చింది. అయితే విజయ్ నటించిన గిల్లీ సినిమా, అజిత్ నటించిన తనివు సినిమాలు రెండు కూడా ఫిబ్రవరి 20వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంల ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌లో జోష్ భారీగా కనిపిస్తున్నది. సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ రెండు సినిమాల గురించిన వివరాల్లోకి వెళితే..
తెలుగులో బ్లాక్‌బస్టర్ చిత్రం ఒక్కడు ఆధారంగా రూపొందిన గిల్లీ చిత్రంలో తమిళ ఇళయ దళపతి విజయ్ నటించడం తెలిసిందే. ఈ చిత్రాన్ని ధరణి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం 8 కోట్ల రూపాయలతో ినర్మించగా.. అప్పట్లో 42 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం తమిళంలో కూడా భారీ విజయాన్ని అందుకొన్నది. 2024 సంవత్సరంలో రీ రిలీజ్ కాగా తమిళనాడు, ఓవర్సీస్‌లో రి రీలీజ్ రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టింది. రీ రిలీజ్ చిత్రాల్లో టాప్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. రీ రిలీజ్ ద్వారా 26 కోట్లకుపైగా కలెక్షన్లను సాదించింది.

ఇక అజిత్ నటించిన తనివు చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బోని కపూర్ నిర్మించారు. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. 2023 సంవత్సరంలో రూపొందిన ఈ సినిమాను 200 కోట్ల రూపాయలతో నిర్మించగా సుమారుగా 250 కోట్ల రూపాయలు థియేట్రికల్‌గా రాబట్టింది. ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాత బోని కపూర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దాంతో ఈ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తనివు చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాగా, మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. ఇప్పటికే ఈ సినిమా సుమారుగా 70 లక్షల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే వసూలు చేసింది. రీ రిలీజ్ తర్వాత తొలి రోజు భారీగా వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక విజయ్ నటించిన గ్లిల్లి సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది. ఈ చిత్రం తనివుతో పోటాపోటీగా వసూళ్లు సాధిస్తున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తమిళనాడులో విజయ్, అజిత్ మధ్య బాక్సాఫీస్ వార్ అంటే అభిమానులకు పండుగ వాతావరణమే ఉంటుంది. ఒకరిని మించి మరొకరు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా అజిత్ నటించిన మంగాథతో థెరీ సినిమా పోటీ పడాల్సింది. అయితే ఓ సినిమా నిర్మాత తన సినిమా రిలీజ్ ఉందని రిక్వెస్ట్ చేయడంతో థెరీ రీ రిలీజ్‌ను వాయిదా వేశారు. ప్రస్తుతం గిల్లీతో తనివు వార్ కొనసాగించేందుకు రెడీ అయింది.


Click it and Unblock the Notifications











