Thalapathy 69: ఇద్దరు ముద్దుగుమ్మలతో విజయ్.. దళపతితో పూజా హెగ్డే మూడోసారి!

బాక్సాఫీస్ వద్ద ది గోట్ మూవీ వసూళ్లు సాధిస్తుండగానే.. దళపతి విజయ్ మరోసారి పట్టాలెక్కించారు. తన కెరీర్‌లో 69వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నది. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు, ముహుర్తపు వేడుకను నవరాత్రి పూజా సందర్భంగా నిర్వహించారు. ఈ వేడుకలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, హీరోయిన్ పూజా హెగ్డే, మలయాళ హీరోయిన్ మమితా బైజు తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ముహుర్తపు వేడుక ఉత్సాహం, సంతోష క్షణాల మధ్య ప్రారంమైంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతికి ఇదే చివరి సినిమా అనే ప్రచారం జరుగుతున్నది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, ప్రియమణి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటిస్తుండటంతో భారీ అంచనాలు పెరిగాయి.

vijays-thalapathy-69-

తమిళ సినిమా రంగంలోనే కాకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మైలురాయిగా నిలిచే విధంగా రూపొందుతున్న ఈ సినిమాకు కే వెంకట్ నారాయణ ళ(కేవీఎన్) తన సొంత బ్యానర్ కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. విజయ్ మూడు దశబ్దాల కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే కథతో ఈ మూవీని నిర్మించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

vijays-thalapathy-69-

దళపతి 69 మూవీ సాంకేతిక విబాగంలో టాప్ మోస్ట్ ఆర్టిస్టులు పనిచేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అన్లరసు యాక్షన్ కొరియోగ్రఫి, సెల్వ కుమార్ ఆర్ట్ డైరెక్షన్, పల్లవి సింగ్ క్యాస్టూమ్స్ డిజైన్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

vijays-thalapathy-69-

విజయ్ కెరీర్‌లో చివరి చిత్రంగా భావిస్తున్న మూవీని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తారు ఈ సినిమాను వచ్చే ఏడాది దసరా పండుగ కానుకగా అక్టోబర్ 2025 లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళ సినీ రంగంలోనే కాకుండా విజయ్ అభిమానులు కాలర్ ఎగురేసుకొనే కథాంశంతో ఈ మూవీని రూపొందిస్తున్నట్టు సమాచారం.

vijays-thalapathy-69-

ఇక ఈ సినిమా వేడుకలో పూజా హగ్డే పాల్గొనడంతోపాటు విజయ్‌తో దిగిన ఫోటోలను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. దళపతితో ఆమెకు ఇది మూడో సినిమా. ఈ సందర్బంగా హలమితి, హబిబో మళ్లీ కలిశారు. విజయ్ సార్‌తో మళ్లీ నటిస్తున్నాను. ఆన్ స్క్రీన్ మరోసారి మ్యాజిక్ ఖాయం అని పోస్టు పెట్టారు.

ఇదిలా ఉండగా, విజయ్ చివరి చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు ఆఫర్‌ను దక్కించుకొన్నారు. దళపతి సరసన ఆమె కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె పూజా కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత విజయ్ సార్‌తో నేను పూజలో పాల్గొన్నాను అంటూ ఫోటోలను షేర్ చేసింది.

More from Filmibeat

Read more about: vijay mamita baiju pooja hegde
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X