twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విక్రమ్,శంకర్ చిత్రం తెలుగు వెర్షన్ టైటిల్ ఏమిటంటే...

    By Srikanya
    |

    చెన్నై : విక్రమ్,శంకర్ కాంబినేషన్ లో 'ఐ' అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ యాక్షన్ ధ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ కి టైటిల్ గా 'మనోహరుడు'ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఆస్కార్‌ ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. తమిళంలో 'ఐ' అనే పేరుని ఖరారు చేశారు. తెలుగులో 'మనోహరుడు' అనే పేరుని నిర్ణయించారు. అమీ జాక్సన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తారు. పి.సి.శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడు. ఈ చిత్రంలో మలయాళ హీరో సురేష్‌ గోపి ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

    గతంలో కూడా శంకర్ సినిమాల తెలుగు వెర్షన్ టైటిల్స్ కు ఓ విశేషం ఉంది. దాన్నే ఈ సినిమాకు సెంటిమెంట్ గా ఫాలో కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయన గత చిత్రాలు...ప్రేమికుడు,ఒకే ఒకే ఒక్కడు,భారతీయుడు,అపరిచితుడు..కు చివర'డు' తో పూర్తవుతున్నాయి. కాబట్టి ఈ సినిమాకు కూడా మనోహరు'డు' అనే నిర్ణయించినట్లు చెప్తున్నారు. ఈ సినిమాకు పి.సి శ్రీరామ్ కెమెరా వర్క్,రహమాన్ సంగీతం ఎప్పటిలాగే హైలెట్ గా నిలుస్తాయంటున్నారు.

    ఇక బాలీవుడ్‌ సినిమా 'త్రీ ఇడియట్స్‌' ని రీమేక్‌ చేసిన తరవాత శంకర్‌... మళ్లీ తన శైలిలోకి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. విక్రమ్‌ని దృష్టిలో పెట్టుకొని శంకర్‌ ఈ కథను సిద్ధం చేసుకొన్నారని సమాచారం. విక్రమ్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం 'అపరిచితుడు'. శంకర్‌ ఆలోచనలకు, సృజనాత్మకతకూ ఈ సినిమా అద్దం పట్టింది. మళ్లీ వీరిద్దరి కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది.. ఆ అవకాశం ఉందంటున్నారు శంకర్ అభిమానులు. ఇది పొలిటికల్ డ్రామా అని చెప్తున్నారు. ఎన్నికల విధానంపై ఈ చిత్రం సాగుతుందని సమాచారం. దర్సకుడు శంకర్ కోరిక మీదట ఈ చిత్రానికి అమీ జాక్సన్ 180 రోజులు కేటాయించారు.

    విక్రమ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'అపరిచితుడు' విడుదలై ఇప్పటికి దాదాపు ఏడేళ్లు అవుతోంది. చాలా విరామం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి 'ఐ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేస్తారు. త్రీ ఇడియట్స్ రీమేక్ చేసిన శంకర్ ఆ చిత్రం వర్కవుట్ కాకపోవటంతో ఈ సారి మళ్లీ తన రూట్ లోకే వెళ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీగా రూపొందే ఈ చిత్రం ఇప్పటివరకూ ఇండియన్ తెరపై ఎవరూ టచ్ చేయని సబ్జెక్టుతో నిండి ఉంటుందని చెప్తున్నారు. యాక్షన్,ఎంటర్టైనర్ తో మాస్ మసాలాగా ఉంటూనే సామాజిక సందేశం తో తయారు చేసిన ఈ స్క్రిప్టు దక్షిణాది భాషలకే కాక హిందీ వారిని సైతం అలరించేలా ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    South India's top director Shankar has chosen Manoharudu title for his current movie with Vikram in the lead role. While he has registered I for the Tamil version, for the Telugu version, Manoharudu, has been registered at Film Chamber of Commerce. Aascar Ravichandran is producing the film. Manoharudu has music by A R Rehman and cinematography by renowned P C Sriram.. Amy Jackson is playing one of the female lead.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X