మహేష్, పిచ్చివేశాలేసే విక్రమ్ తోటి మణిరత్నం...
కొద్ది కాలంగా ప్రయోగాల జోలికి పోకుండా కమర్షియల్ సినిమాలతో నెట్టుకొస్తున్న విక్రమ్ 'మల్లన్న", 'విలన్" లాంటి పరాభవాల తర్వాత తనకిష్టమైన ఎక్స్ పెరిమెంటల్ జోన్ లోకి వెళ్లిపోయాడు. విజయ్ దర్శకత్వంలో రూపొందే 'దైవ మగన్" చిత్రంలో విక్రమ్ మెంటల్లీ రిటార్డెడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. హాలీవుడ్ సినిమా 'ఐ యామ్ శామ్" చిత్రానికి ప్రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. మానసిక వికలాంగుడైన ఒక తండ్రి తన కూతురిపై హక్కుల కోసం చేసే న్యాయపోరాటం నేపథ్యంలో ఈ చిత్రం సాగుగుంది. అతనికి సాయపడే లాయర్ పాత్రలో అనుష్క నటిస్తోంది. విక్రమ్ భార్య పాత్రకి అమలా పాల్ ఎంపికయింది.
విక్రమ్ ని హీరోగా నిలబెట్టిన సినిమాల్లో ఎక్కువగా అతను ఛాలెంజింగ్ రోల్స్ చేశాడు. 'సేతు", 'కాశి", 'పితామగన్" తదితర చిత్రాల్లో విక్రమ్ అత్యద్భుత నటన ప్రదర్శించాడు. అయితే కొద్ది రోజులుగా కమర్షియల్ హీరో కావాలనే ఆరాటంతో వరుస పరాజయాలను కొని తెచ్చుకున్నాడు. దాంతో మరోసారి తన బలమేంటో తెలుసుకుని దానినే నమ్ముకుంటున్నాడు. ఈ చిత్రంతో మళ్లీ తనకి పూర్వ వైభవం వస్తుందనే విక్రమ్ ఆశిస్తున్నాడు.
అంతే కాకుండా తెలుగులో మహేష్ తో మణిరత్నం ఓ చిత్రం చెయ్యబోతున్నారన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కాగా మహేష్, జాతీయ ఉత్తమ నటుడు విక్రమ్ లతో మణిరత్నం కాంబినేషనల్ లో రోబో వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన సన్ పిక్చర్స్ కళానిధి మారన్ ఈ చిత్రాన్ని 160కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మంచబోతున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











