నా ప్రేమ పాఠాలు, రొమాన్స్ అనుష్కతోనే

By Srikanya

చెన్నై : నా ప్రేమ పాఠాలు, డ్యూయెట్లు అన్నీ అనుష్కతోనే. ఎమిజాక్సన్ నన్ను ప్రేమిస్తుంది. లక్ష్మీరాయ్‌ది చాలా ముఖ్యమైన పాత్ర. హాస్యానికి సంతానం ఉన్నారు. చిత్రం అంతా విక్రమే కనిపిస్తే థియేటర్లలో ప్రేక్షకులు దమ్ము కొట్టాలని బయటకు వెళతారు. అందువల్లే ఈ కలర్‌ఫుల్ కాంబినేషన్. శివ తాండవంలో నేను పోలీసు అధికారిగా నటించాను. నా స్నేహితుడిగా జగపతిబాబు నటించారు అంటూ వివరించారు విక్రమ్. శివ తాండవం ఈ నెల 28న తమిళం, తెలుగు భాషల్లో సుమారు వెయ్యి థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

విక్రమ్ తాజా చిత్రం తాండవం. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎమిజాక్సన్, లక్ష్మీరాయ్ మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. తెలుగు హీరో జగపతిబాబు ముఖ్యపాత్రను పోషిస్తున్న ఈ చిత్రాన్ని యూటీవీ మోషన్ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది. ఇటు చిత్ర పరిశ్రమలోనూ, అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు సంతరించుకున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యూ సర్టిఫికెట్‌తో పాటు చక్కని మాస్ ఎంటర్‌టైనర్ చిత్రంగా సెన్సార్ బృందం ప్రశంసలను అందుకుంది.

ఇక శివ తాండవం కథ గురించి దర్శకుడు విజయ్ చెప్పినప్పుడు చాలా ఇంప్రెష్ అయ్యాను. అయినా ఒక అంధుడు పగ తీర్చుకోవడం అనేది లాజిక్‌కు దూరంగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. అప్పుడు ఈ కథ విన్న చాయాగ్రాహకుడు నీరవ్‌షా తన ఐపాడ్‌లో ఒక వ్యక్తిని చూపించారు. ఆయనే డేనియల్ కిష్. చూపులేకపోయినా వినికిడితో గ్రహించే ఎకో లొకేషన్ ప్రతిభను పొందిన వ్యక్తి అని అందులో పేర్కొంది. ఆయన కాలిఫోర్నియాలో ఉన్నారని తెలుసుకుని దర్శకుడు విజయ్ వెళ్లి డేనియల్ కిష్‌ను కలుసుకుని కొన్ని వీడియో విజువల్స్‌ను తీసుకొచ్చారు. ఆ తరువాత ఆయన వద్ద కొంత శిక్షణ పొందాను. తాండవం చిత్రం విడుదల అనంతరం డేనియల్ కిష్‌కు తమిళనాడులో ప్రాచుర్యం పెరుగుతుంది అన్నారు.

దర్శకుడు విజయ్ గురించి మాట్లాడుతూ...విజయ్ దర్శకత్వం వహించిన చిత్రాలన్నింటినీ గమనిస్తే మీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ఆయన ఒక్కో చిత్రం ఒక్కో నేపథ్యంలో సాగుతుంది. ఒక్క చిత్రానికి మరో చిత్రానికి సంబంధమే ఉండదు. ఈ విధంగా వెరైటీ చిత్రాలను కొందరు దర్శకులు మాత్రమే రూపొందించగలరు. అలాంటి వారిలో విజయ్ ఒకరు. తాండవం చిత్రం కోసం లండన్‌లో 60 రోజులు షూటింగ్ చేశాం. అక్కడి వాతావరణం గాని, అందమైన లొకేషన్స్‌గాని నేను అంతగా పట్టించుకోలేదు. విజయ్ అపారమైన శ్రమ, పర్ఫెక్షన్ మాత్రమే నన్ను ఆకట్టుకుంది. ఆయనతో ఎన్ని చిత్రాలు చేసినా బోర్ కొట్టదు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X