ఆ హీరో కొక్కొరొకో...

భీమ సినిమా అనంతరం నిర్మాత కలై పులి ధానుతో సినిమా చేస్తానని ప్రామిస్ చేసానని, అదికూడా ఓ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రమని కమిటయ్యామని, అయితే కథ లేకపోవటంతో కొంతకాలం ఆగాము. ఆ తర్వాత సుసి గణేషన్ ఓ అరడజను కథలతో నా దగ్గరకి వచ్చాడు. అందులో నాకు నచ్చింది..ఈ సూపర్ హిరో స్టోరి. అయితే సౌత్ లో ఇలాంటి కథలు వర్కవుట్ అవుతాయా అంటే హృతిక్ రోషన్ క్రిష్ చేసినప్పుడు ఎట్లా ప్రేక్షకులు ఆశ్వీదరించారో...ఈ సినిమాకూ అట్లాంటి ఆదరణే దక్కుతుందనుకుంటున్నాను.
ఇది ముఖ్యంగా పిల్లలను బాగా ఆకట్టుకుంటుంది. అలాగే నాకు ఎగిరే సూపర్ హీరోలు అంటే ఇష్టం. కానీ నా పాత్ర మల్లన్నలో ఎగరదు బ్యాడ్ కదా అని చెప్తున్నాడు. సర్లే ఈ చిత్రంలో హీరోయిన్ శ్రియతో లిప్ కిస్ ఉందంటున్నారు నిజమేనా అంటే..నవ్వి..ఉండచ్చు..ఉండకపోవచ్చు..నేను చెప్పను అన్నారు.


Click it and Unblock the Notifications











