ధరణికి పట్టిందల్లా బంగారం
ఇప్పుడు వార్తల్లో ఉన్న యంగ్ స్టార్ డైరెక్టర్ ధరణి. ఎఎం రత్నం పవన్ కళ్యాణ్‌తో నిర్మిస్తున్న భారీ చిత్రం బంగారంలో ఆయన ప్రస్తుతం బిజీగా ఉన్నారు. దర్శకుడు శంకర్ లాగానే పర్ఫెక్షనిస్టుగా ధరణికి పేరుంది. అందుకే బంగారం సినిమా స్క్రిప్టు దశ నుంచి షూటింగ్ దశ వరకు ఆలస్యంగా నడుస్తోంది. నిర్మాత రత్నంతో ఖర్చు విషయంలో ధరణికి తేడాలు వచ్చాయని తమిళ పత్రికలు కోడై కూస్తున్నాయి. బంగారం దాదాపు పూర్తయింది. ఈ సినిమా ఆడియో మార్చి 15న విడుదల కానుంది. సినిమా ఏప్రిల్‌లో ఏ తేదీన అయినా విడుదల కావచ్చు. ఈ సినిమా తర్వాత ధరణి విక్రమ్‌ను హీరోగా పెట్టుకుని ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తారని తాజా సమాచారం. తమిళ తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఆ సినిమాను విక్రం స్వయంగా నిర్మించాలనుకోవడం విశేషం.


Click it and Unblock the Notifications