హల్లో విక్రమ్ 9884111111

ఓ ప్రక్క బాలీవుడ్ నటులు బ్లాగుల ద్వారా తమ ఫ్యాన్స్ కి దగ్గరవుతున్నారు. అయితే జాతీయ నటుడు విక్రమ్ మరో అడుగు ముందుకేయదలిచాడు. తన అభిమానులకు తన ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నాడు. ఆ నెంబరే 9884111111. అపరిచితుడుగా నెట్ ద్వారా ప్రజల సమస్యలు తెల్సుకుని వారిని కాపాడినట్లే ...ఇక్కడ ఫ్యాన్స్ ఇచ్చే అమూల్యమైన సలహాలను స్వీకరించటానికి రెడీ అవుతున్నాడు.
అయితే అందరుకీ ఫోన్ లో సమాధానం చెప్పటం సాధ్యం కాదని ఎస్.ఎమ్.ఎస్ లయితే మేలని చెప్తున్నాడు. వాటికి ఖాళీ ఉన్నప్పుడల్లా సమాధానం ఇస్తానని హామీ ఇస్తున్నాడు. ఇక ఎన్.ఆర్.ఐ అభిమానుల కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ఓపెన్ చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నానని చెప్తున్నాడు.ఇక విక్రమ్ ఇప్పటికే తన అభిమానుల కోసం వైధ్య సుధ అనే హాస్పటల్ , మెంటల్లీ ఛాలెంజెడ్ పిల్లల కోసం స్కూల్,నేత్ర దాన శిబిరాలు నడపటం వంటివి చేస్తున్నాడు.ఇది చూసి ప్రేరణ చెంది మన హీరోలు కూడా తమ నెంబర్లును బహిరంగంగా ప్రకటిస్తే బాగుండనని అభిమానలు ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











