'టపాకాయ్' చిత్రంలో నటిస్తున్న ఇలియానా
ఇలియానా తమిళంలో విక్రమ్ సరసన ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్ 'వెడి'. దీని అర్దం టపాకాయ్. ఈ విషయాన్ని విక్రమ్ స్వయంగా చెప్తున్నారు. ఆ చిత్రం గురించి మాట్లాడుతూ......:"రాబోయే చిత్రంలో పోలీసు అధికారిగా కనిపించబోతున్నాను. పూర్తిస్థాయిలో వినోదాన్ని పంచే మసాలా కథ ఇది. ఇలియానా హీరోయిన్. తమిళంలో 'వెడి' అని పేరుపెట్టారు. అర్థం చెప్పాలంటే టపాకాయ్! తెలుగులో ఇంకా పేరు నిర్ణయించలేదు. భూపతి పాండ్యన్ దర్శకుడు. వచ్చే నెల నుంచి షూటింగ్" అన్నారు. అయితే తెలుగుకి ఓ ప్రముఖ నిర్మాత రైట్స్ తీసుకోబోతున్నారని వేడి అనే టైటిల్ పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో విక్రమ్ పాత్ర టపాకాయ్ లా పేలేలా ఉంటుందని ఉద్దేశ్శంతో పెట్టారు. ఇలియానా ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు, ఓ తమిళ సినిమా చేస్తూ బిజీగా ఉంది..తెలుగులో 'శక్తి' చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ తో లవ్ ఆజ్ కల్ రీమేక్ లోనూ మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











