twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్జున్‌రెడ్డి చేయడం ధ్రువ్‌కు ఇష్టం లేదు.. నాకు చేయాలని ఉంది కానీ.. విక్రమ్

    By Rajababu
    |

    Recommended Video

    నా కొడుకు లేకుంటే.. అర్జున్‌రెడ్డిని నేనే ట్రై చేసేవాడిని..!

    అపరిచితుడు, ఐ లాంటి చిత్రాలతో విలక్షణ నటుడిగా విక్రమ్ ముద్రవేసుకొన్నాడు. ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు చియాన్. తాజాగా తన నట వారసుడిగా ధ్రువ్‌ను విక్రమ్ సినీ రంగానికి పరిచయం చేస్తున్నారు. అర్జున్‌రెడ్డి చిత్రం ద్వారా తమిళ చిత్ర రంగానికి ధ్రువ్ పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్ గురించి పలు విషయాలను ఆయన వెల్లడించారు.

    అర్జున్‌రెడ్డితో ధ్రువ్

    అర్జున్‌రెడ్డితో ధ్రువ్

    అర్జున్ రెడ్డి సినిమాతో మా అబ్బాయి ధ్రువ్‌ని సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నాం. వాస్తవానికి రెండు మూడేళ్ల తర్వాత సినిమా రంగానికి పరిచయం చేయాలని ప్లాన్ చేశాం. అనుకోకుండా అర్జున్ రెడ్డి సినిమాతో రెడీ అయ్యాడు.

    ముందు నేను ఒప్పుకోలేదు

    ముందు నేను ఒప్పుకోలేదు

    ధ్రువ్ అమెరికాలోని మెథడ్ యాక్టింగ్ కోర్సు చదువుకొన్నాడు. యూకేలో డైరెక్షన్ కోర్సు చేస్తున్నాడు. అంతలోనే అర్జున్‌రెడ్డి ఆఫర్ వచ్చింది. ముందుగా నేను ఒప్పుకోలేదు. కానీ ఓ నిర్మాత వచ్చిన అర్జున్‌రెడ్డి రైట్స్ కొన్నాను అని చెప్పాడు. అయితే ఇంకా నటుడిగా ఒక పరిణితి చెందలేదని నేను ఒప్పుకోలేదు.

    అర్జున్‌రెడ్డిగా ధ్రువ్ కరెక్ట్

    అర్జున్‌రెడ్డిగా ధ్రువ్ కరెక్ట్

    ధ్రువ్ డబ్‌స్మాష్ వీడియోలు చూశాను. అర్జున్‌రెడ్డి సినిమాకు ధ్రువ్ యాప్ట్ అనిపిస్తున్నాడని ఒత్తిడి చేయడంతో సరే అన్నాను. ఆ తర్వాత అర్జున్ రెడ్డి చూశాను. ఆ క్యారెక్టర్‌కు ధ్రువ్ సరిగ్గా సరిపోతాడని అనిపించింది.

     షరతులు పెట్టి ఒకే అన్నాడు

    షరతులు పెట్టి ఒకే అన్నాడు

    అర్జున్‌రెడ్డి ఆఫర్ విషయాన్ని ధ్రువ్‌కు చెప్పాను. అయితే ఇప్పుడే సినిమాలు చేయడం ఇష్టం లేదు అని చెబితే.. లేదు లేదు.. సినిమా చేస్తే బాగుంటుంది అని అన్నాను. అర్జున్‌రెడ్డి సినిమా చూశావా అని కన్ఫర్మ్ చేసుకొన్న తర్వాత ఓ షరతుతో సినిమా చేయడానికి అంగీకరించాడు.

     అర్జున్‌రెడ్డి తర్వాత మళ్లీ

    అర్జున్‌రెడ్డి తర్వాత మళ్లీ

    అర్జున్‌రెడ్డి తర్వాత మళ్లీ డైరెక్షన్ కోర్సు చేయడానికి ప్రాగ్‌కు వెళ్తా అని షరతు విధించాడు. నేను సరే అన్నాను. దాంతో అర్జున్‌రెడ్డి సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. ఆ తర్వాత సినిమాను అనౌన్స్ చేసి వర్మ టైటిల్‌ను ప్రకటించాం.

     విజయ్ దేవరకొండ అద్భుతంగా

    విజయ్ దేవరకొండ అద్భుతంగా

    అర్జున్‌రెడ్డి సినిమా నాకు స్వయంగా చేయాలనిపించేంతగా క్రేజ్ ఉంది. కానీ ఎవరైనా నన్ను అడిగితే నేను చేయడానికైనా రెడీగా ఉన్నాను. విజయ్ దేవరకొండ చాలా అద్భుతంగా చేశాడు. ధ్రువ్ కరెక్ట్‌గా సరిపోతాడు. నా కొడుకు లేకుంటే నేను అర్జున్‌రెడ్డిని ట్రై చేసేవాడిని.

     రాజకీయాల్లోకి నేను రాను

    రాజకీయాల్లోకి నేను రాను

    నాకు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు. నాకు లుంగీ కట్టుకోవడం సరిగా రాదు. ఇక రాజకీయాల్లోకి నేను ఎలా సరిపోతాను. యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సినిమానే నాకు ప్రపంచం. సినిమా తప్ప నాకు మరొకటి తెలియదు. పాలిటిక్స్ నాకు సూట్ కావు.

     సినిమానే నాకు ప్రపంచం

    సినిమానే నాకు ప్రపంచం

    సినిమా నటులు రాజకీయాల్లోకి రావడమనేది వ్యక్తిగత అంశం. ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. నాకు నటించడమే నాకు ఇష్టం. స్లీప్ సినిమా.. ఈట్ సినిమా.. డ్రింక్ సినిమా అనే లాంటివాడిని.

     వయసుతో సంబంధం లేదు

    వయసుతో సంబంధం లేదు

    నాకు వయసుతో సంబంధం లేదు. కాలేజీ స్టూడెంట్‌గా యాక్ట్ చేసి కూడా మెప్పించగలను. నేను ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. తెలుగులో జగపతిబాబు లాంటి పాత్రలు చేయడానికి రెడీగా ఉన్నాను.

    English summary
    Sketch is a 2018 Tamil action thriller film, written and directed by Vijay Chandar and produced by Moving Frame. The film features Vikram and Tamannaah in the leading roles, with Soori, Vishwanath and R.K. Suresh among others portraying supporting roles. This movie is going to release in Telugu soon. In this occassion Vikram speaks to Telugu Filmibeat exclusively..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X