నా భార్య కూడా అదే అడిగింది.. నేను, తమన్నా షాక్.. విక్రమ్ ఇంటర్వ్యూ

By Rajababu

సేతు, అపరిచితుడు, శివపుత్రుడు, ఐ సినిమాలతో ప్రేక్షకులను థ్రిల్ చేసిన విక్రమ్ తాజాగా స్కెచ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తమిళంలో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తున్నది. విక్రమ్‌తోపాటు తమన్నా నటించిన స్కెచ్ చిత్రం అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా విక్రమ్ తెలుగు ఫిల్మ్‌బీట్‌తో మాట్లాడారు. స్కెచ్ సినిమా గురించి విక్రమ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

Recommended Video

బాహుబలి తరహా మరో భారీ సినిమా.. హీరో ఎవరో తెలుసా?
 పక్కా కమర్షియల్ మూవీ

పక్కా కమర్షియల్ మూవీ

స్కెచ్ చిత్రం పక్కా కమర్షియల్ సినిమా. ఈ చిత్రంలో స్పెషల్ ఏమిటంటే మాస్ ఎలిమెంట్స్‌ను కొత్తగా ప్రజెంట్ చేశాం. రియలిజం, ఫాంటసీ ఆకట్టుకునేలా ఉంటాయి. ఇంకొకడు సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తెలుగులో వస్తుంది అని నేను అనుకొంటున్నాను.

 కార్లు లోన్లు.. సీజ్ కథాంశంతో

కార్లు లోన్లు.. సీజ్ కథాంశంతో

కారు లోన్ల తీసుకొని ఇన్స్‌టాల్‌మెంట్ చెల్లించని వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసే గ్యాంగ్ కథ. రొమాన్స్‌కు మంచి స్కోప్ ఉన్న సినిమా. కారు లోన్లు కట్టకపోతే సీజ్ చేసినప్పుడు ఓ వ్యక్తితో జరిగిన సంఘటనతో సినిమా మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది చాలా అద్భుతంగా ఉంటుంది. క్లైమాక్స్ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది.

 జెమినీ, సామీ మాదిరిగా

జెమినీ, సామీ మాదిరిగా

స్కెచ్ చిత్రం నేను చేసిన జెమినీ, సామి సినిమా కోవలో ఉంటుంది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు విక్రమ్ ఫెర్ఫార్మెన్స్ బాగుంది అంటున్నారు. చాలా రోజుల తర్వాత చేసిన కమర్షియల్ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. కొత్తగా అనిపించే హీరోయిజం ఈ సినిమాలో ఉంటుంది. ప్రేక్షకులను చాలా ఆకట్టుకొంటున్నది.

 నా రోల్ చాలా డిఫరెంట్‌గా

నా రోల్ చాలా డిఫరెంట్‌గా

స్కెచ్ సినిమాలో నా పాత్ర గత చిత్రాల కంటే డిఫరెంట్‌గా ఉంటుంది. నా రోల్ డిఫరెంట్‌గా లేకపోతే నేను చేయను. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా చేశాం. దాని గురించి చెబితే బాగుండదు.

 అవార్డులు వాటికే ఇవ్వొద్దు

అవార్డులు వాటికే ఇవ్వొద్దు

నాన్న, జెమిని, ఇంకోకడు చిత్రాల మాదిరిగా చాలెంజింగ్ ఉండదు. చాలా రెగ్యులర్ కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమాలో మీ పెర్ఫార్మెన్స్ బాగుంది అని అందరూ అంటున్నారేమిటి అని నా భార్య కూడా అడిగింది. శివపుత్రుడు, సేతు లాంటి సినిమాల్లో నటిస్తేనే అవార్డులు ఇవ్వకూడదు. ఫెర్మార్మెన్స్‌ను పరిగణనలోకి తీసుకోకూడదు. కమర్షియల్ సినిమాలోని ఫెర్మార్మెన్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

 అవి రెండు కళ్ల లాంటివి

అవి రెండు కళ్ల లాంటివి

కమర్షియల్ సినిమాలు, ఎక్స్‌పెరిమెంట్ తరహా చిత్రాలు నాకు రెండు కళ్లు లాంటివి. కేవలం ప్రయోగాత్మక చిత్రాలకే పరిమితం కాకూడదు. ఫ్యాన్స్ కోసమే సినిమాలు చేయకూడదు. ఫ్యాన్స్ కూడా కమర్షియల్ సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే స్కెచ్ సినిమా చేశాను.

 కథ నచ్చడం వల్లే స్కెచ్

కథ నచ్చడం వల్లే స్కెచ్

స్కెచ్ సినిమా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం కథ. కథ విన్న తర్వాత నేను షాక్ అయ్యాను. తమన్నా కూడా షాక్ గురైంది. వావ్ అని తమన్నా డైరెక్టర్‌ను ప్రశంసలతో ముంచెత్తింది. సినిమా చూసిన తర్వాత కూడా తమన్నా ఉద్వేగానికి గురైంది. తెలుగు వాళ్లు కూడా తమిళ వెర్షన్ చూసి బాగుందని కితాబు ఇచ్చారు. గురు గారు... తెలుగులో కూడా సక్సెస్ అవుతుందని అన్నారు.

 తమన్నాతో రొమాన్స్

తమన్నాతో రొమాన్స్

స్కెచ్ చిత్రంలో తమన్నా ఓ బ్రాహ్మణ అమ్మాయిగా నటించింది. చాలా సీరియస్ రోల్ ఆమెది. మా కాంబినేషన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా ఇద్దరి మధ్య రొమాన్స్ పండింది. తొలిచూపులోనే ప్రేమలో పడే కథ కాదు. పలుమార్లు కలుసుకొన్న తర్వాత ప్రేమలో పడే కథ ఇది.

 సామాజిక సందేశం లేదు

సామాజిక సందేశం లేదు

నా కెరీర్‌లో మల్లన్న, జెమినీ, ధూల్ లాంటి సినిమాలు కమర్షియల్ ‌గా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకు చేసిన రోల్స్‌కు స్కెచ్ సినిమాలో చేసిన పాత్ర చాలా డిఫరెంట్. ఈ చిత్రంలో సామాజిక సందేశం లేదు. పక్కా కమర్షియల్ సినిమా. సినిమా చూసిన వెంటనే ప్రేక్షకులు థ్రిల్‌గా ఫీలవుతారు. దర్శకుడు విజయ్ చందర్ చెప్పిన కథ విని స్కెచ్ సినిమా చేశాను.

తెలుగులో మంచి స్క్రిప్టు వస్తే

తెలుగులో మంచి స్క్రిప్టు వస్తే

తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలని ఉంది. మంచి స్క్రిప్టు వస్తే సినిమా చేస్తాను. కానీ నటుడు, సినిమాలు కేవలం భాషకే పరిమితం కాకూడదు. బాహుబలి కేవలం తెలుగు సినిమా కాదు. అది ఇండియన్ సినిమా. ఆ సినిమాను తెలుగు చూశారు. హిందీలో, తమిళంలో భాషలకతీతంగా సినిమాను ఆదరించారు.

నా చిత్రం ఇండియన్ సినిమా

నా చిత్రం ఇండియన్ సినిమా

బాహుబలి మాదిరిగానే నా చిత్రం ఇండియన్ సినిమా ఉండాలని కోరుకొంటాను. తెలుగులో నటిస్తే నేను తెలుగు నటుడిని. తమిళంలో చేస్తే తమిళ నటుడిని. నాకు భాషలతో సంబంధం లేదు. అందుకే హిందీలో కూడా ఓ సినిమా చేస్తున్నాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X