twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    300 కోట్లతో కర్ణ.. దిమ్మతిరిగే నటీనటులు.. బాహుబలి వల్లనే. విక్రమ్ ఇంటర్వ్యూ

    By Rajababu
    |

    విలక్షణ పాత్రలు, విభిన్నమైన చిత్రాలకు పెట్టింది పేరు చియాన్ విక్రమ్. దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాదు.. బాలీవుడ్‌ ప్రేక్షకులను తన చిత్రాలతో మెప్పించాడు. తాజాగా ఆయన నటించిన స్కెచ్ మూవీ విడుదలై సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. త్వరలోనే తెలుగులో అదే పేరుతో రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఈ నేపథ్యంలో విక్రమ్ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. ఆ సంభాషణ ఆయన మాటల్లోనే..

    గౌతమ్ మీనన్‌తో ధ్రువ నక్షత్రం

    గౌతమ్ మీనన్‌తో ధ్రువ నక్షత్రం

    స్కెచ్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాను. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధ్రువ నక్షత్రం షూటింగ్ జరుగుతున్నది. దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తయింది. ఆ తర్వాత 45 రోజులపాటు షూటింగ్ ఉండే ఓ సినిమాను ఒప్పుకొన్నాను. ఆ తర్వాత కమల్ హాసన్ నిర్మించే సినిమాలో నటిస్తున్నాను.

    Recommended Video

    బాహుబలి తరహా మరో భారీ సినిమా.. హీరో ఎవరో తెలుసా?
     300 కోట్లతో మహావీర కర్ణ

    300 కోట్లతో మహావీర కర్ణ

    ఈ చిత్రాల తర్వాత సుమారు 300 కోట్ల వ్యయంతో మహావీర కర్ణ సినిమాలో నటిస్తున్నాను. ఫిబ్రవరి చివర్లో సినిమా వివరాలను నిర్మాతలు వెల్లడిస్తారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు విని షాక్ అవుతారు. ఇండియాలో ఉండే పాపులర్ నటులంతా అందులో నటిస్తారు.

     బ్రహ్మండంగా నటీనటుల ఎంపిక

    బ్రహ్మండంగా నటీనటుల ఎంపిక

    మహాభారతం అంటే కర్ణుడు, భీష్ముడు, ధుర్యోధనుడు, కుంతి, ద్రౌపది ఇలాంటి పాత్రలు కీలకం. భీష్ముడు పాత్రను ఎవరి చేస్తే బ్రహ్మండంగా ఉంటుంది. ధుర్యోధనుడు, కుంతి, ద్రౌపది ఇలాంటి పాత్రలను ఎవరి చేస్తే బాగా పండుతాయి. ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నటీనటుల ఎంపికపై కసరత్తు జరుగుతున్నది.

    మహావీర్ణ కర్ణ సినిమాను తొలుత 100 కోట్ల వ్యయంతో తెరకెక్కించాలనుకొన్నాం. సినిమా రేంజ్ పెరుగడం, సాంకేతిక నిపుణులు, బిజినెస్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమాను ఉత్తమంగా తెరకెక్కించాలని మరో 200 కోట్లు అదనంగా చేర్చాం.

     ఫిబ్రవరిలో కర్ణ ప్రారంభం

    ఫిబ్రవరిలో కర్ణ ప్రారంభం

    ఫిబ్రవరిలో చాలా గ్రాండ్‌గా సినిమాను ప్రారంభిస్తాం. ఈ సినిమా గురించి చెప్పాలని చాలా ఆసక్తిగా ఉంది. కానీ నేను చెప్పలేకపోతున్నాను. త్వరలోనే చాలా బ్రహ్మండమైన న్యూస్ వింటారు. .

    బాహుబలి సినిమా ఇన్సిపిరేషన్

    బాహుబలి సినిమా ఇన్సిపిరేషన్

    బాహుబలి సినిమా దక్షిణాది సినిమా పరిశ్రమకు ఇన్సిపిరేషన్. బిజినెస్ పరంగా దక్షిణాది సినిమాలకు ఎంత సత్తా ఉందో నిరూపించిన చిత్రం. దక్షిణాది సినిమా పరిశ్రమలో మంచి స్క్రిప్టులు ఉన్నాయి. టాలెంట్ ఉంది అని నిరూపించిన చిత్రం బాహుబలి. బాహుబలి ఏకకాలంలో రిలీజై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణను మూటగట్టుకొన్నది.

    ఆస్కార్ స్ఠాయిలో కర్ణ

    ఆస్కార్ స్ఠాయిలో కర్ణ

    మహాభారతం అంటే పవర్‌ఫుల్. ప్రతీ ఒక్కరికి మహాభారతం గురించి తెలుసు. ప్రతీ ఒక్కరి రక్తంలో ఆ కథ ఉంది. అలాంటి కథను ఇంటర్నేషనల్ రేంజ్‌లో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాం. ఆస్కార్ వస్తుందని అనుకొంటున్నాం. వస్తే చాలా సంతోషం. లేదంటే ఓ ప్రయత్నం చేశామని అనుకొంటాం.

    English summary
    Sketch is a 2018 Tamil action thriller film, written and directed by Vijay Chandar and produced by Moving Frame. The film features Vikram and Tamannaah in the leading roles, with Soori, Vishwanath and R.K. Suresh among others portraying supporting roles. This movie is going to release in Telugu soon. In this occassion Vikram speaks to Telugu Filmibeat exclusively..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X