twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐక్యరాజ్య సమితి యువ రాయబారిగా మన హీరో ఎంపిక...కంగ్రాట్స్

    By Srikanya
    |

    తమిళ, తెలుగు చిత్రాల ద్వారా స్టార్ స్టేటస్ ని తెచ్చుకుని తన నటనతో జాతీయ అవార్డులను సైతం పొందిన విక్రమ్ మరో అడుగు ముందుకేశారు.ఆయన ఐక్యరాజ్య సమితికి చెందిన హ్యూమన్‌ సెటిల్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యూన్‌ హాబిటట్‌)కి యువ రాయబారిగా ఎంపికయ్యారు. పేదరిక నిర్మూలన, సామాజిక సేవలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తుంది హాబిటట్‌. ప్రపంచవ్యాప్తంగా నలుగురు రాయబారుల్ని ఎంపిక చేశారు. అందులో విక్రమ్‌ ఒకరు. తమిళనాడులోని కొన్ని గ్రామాల్ని దత్తత తీసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విక్రమ్‌. అలాగే విక్రమ్‌ సంజీవని ట్రస్ట్‌, ద విక్రమ్‌ ఫౌండేషన్‌ల తరఫున సంక్షేమ కార్యక్రమాలు సాగిస్తున్నారాయన. యూన్‌ హాబిటట్‌ 23వ అంతర్జాతీయ పాలక సమితి సమావేశం కెన్యాలోని నైరోబీలో జరుగుతోంది. విక్రమ్‌ ప్రస్తుతం ఆ సమావేశాల్లో పాల్గొనేందుకువ వెళ్లారని ఆయన సన్నిహితులు ఓ ప్రకటనలో తెలిపారు.

    English summary
    Vikram has been selected as the Youth Envoy for the UN Habitat (United National Human Settlement Programme). While four envoys have been selected from across the world, Vikram is one among them and is a part of the Asian Contingent.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X