Vikram All Time Record: కమల్ హాసన్ ముద్దుల వర్షం.. వాళ్లతో సహపంక్తి భోజనం.. తమిళనాడులో అన్ని రికార్డులు బ్రేక
విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 2 వారాల తర్వాత అదే జోష్‌ను కొనసాగిస్తున్నది. అయితే ఈ చిత్రం వసూళ్ల పరంగా కాసులు వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో విక్రమ్ మూవీ టీమ్ విక్రమ్ ఆల్‌టైమ్ రికార్డు పేరిట చెన్నైలో భారీ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో కమల్ హాసన్, అనిరుధ్, ఉదయనిధి స్టాలిన్, నెల్సన్ కుమార్, విజయ్ సేతుపతి తదితరులు హాజరయ్యారు. Vikram All time Record వేడుక వివరాల్లోకి వెళితే..

తమిళనాడు బాక్సాఫీస్ వద్ద
విక్రమ్ చిత్రం తమిళనాడులో బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. భారీ వసూళ్ల కురిపిస్తున్న నేపథ్యంలో కమల్ హాసన్ చెన్నైలో డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నటీనటులతో కలిసి భారీ వేడుకను నిర్వహించారు. డిస్టిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు కమల్, చిత్రంలో నటీనటులు మెమెంటోలు అందజేశారు.

కమల్ హాసన్ ముద్దులు పెట్టి
విక్రమ్ ఆల్‌టైమ్ రికార్డుల ఫంక్షన్‌లో అరుదైన అపురూపమైన దృశ్యాలు కనిపించాయి. నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌కు, దర్శకుడు నెల్సన్ కుమార్‌కు, విజయ్ సేతుపతికి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కు కమల్ హాసన్ ముద్దుల వర్షం కురిపించారు.

నెల్సన్ కుమార్‌తో కలిసి సహపంక్తి భోజనం
ఇక విక్రమ్ ఆల్ టైమ్ రికార్డు వేడుక తర్వాత కమల్ హాసన్ చేసిన ఓ పనితో నెటిజన్ల మనసులను దోచుకొన్నారు. డిస్టిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు, మీడియా సభ్యులతో కలిసి సహ పంక్తి భోజనం చేశారు. కమల్ హాసన్ పక్కనే నెల్సన్ కుమార్ అరటి ఆకులో భోజనం చేస్తూ ఆనందంగా కనిపించారు.

తమిళనాడులో రెండు వారాల్లో
ఇదిలా ఉండగా.. తమిళనాడులో విక్రమ్ చిత్రం గత రెండు వారాల్లో 188 కోట్ల వసూళ్లను రాబట్టింది. తమిళనాడు బాక్సాఫీస్ చరిత్రలో ఈ రేంజ్‌లో వసూళ్లను సాధించడం ఇదే మొదటిసారి. బాహుబలి, కేజీఎఫ్2 చిత్రాల వసూళ్లను సునాయసంగా దాటేసింది.

మలేషియాలో రికార్డుల జోరు
విక్రమ్ చిత్రం మలేషియాలో రికార్డు వసూళ్లను సాధించింది. గత రెండు వారాల్లో ఈ చిత్రం 10.2 మిలియన్ల మలేషియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో 18 కోట్ల రూపాయలను రాబట్టింది. 2022లో 10 మిలియన్ మలేషియన్ డాలర్లు సాధించిన రెండో చిత్రంగా విక్రమ్ ఘనతను సాధించింది. ఇంతకు ముందు ఈ రికార్డును కేజీఎఫ్2 క్రియేట్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల వసూళ్లంటే..
విక్రమ్ చిత్రం తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో భారీ వసూళ్లను సాధించింది. గత 16 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల రూపాయలు రాబట్టింది. మూడో వారంలో కూడా భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











