‘కోబ్రా’గా విక్రమ్.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?

సినిమాలోని పాత్రకు అనుగుణంగా మారడానికి ఎంతటి కఠోర శ్రమనైనా చేసేందుకు ముందుండే హీరో విక్రమ్. ఏ చిత్రాన్ని ఒప్పుకున్నా.. అందులో తన ప్రత్యేకతను చూపెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. ఈ హీరో హిట్టు అనేది చూడక ఎన్నో యేళ్లు అవుతోంది. అపరిచితుడు రేంజ్ సక్సెస్ కొట్టలేకపోతున్నాడు.

ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొడుతున్నాయి. ఐ తరువాత ఇంకొక్కడు, స్వామి చిత్రాలు కూడా నిరాశ పరిచాయి. ధృవ నక్షత్రం, కోబ్రా అనే సినిమాలు ఆలస్యమవుతూ వస్తున్నాయి. ధృవ నక్షత్రం సినిమా టీజర్ ఆ మధ్య రిలీజై హల్ చల్ చేసింది. మళ్లీ చడీచప్పుడు లేకుండా సైలెంట్ అయిపోయింది.

Vikram Movie Cobra First Look On 28th February

తాజాగా విక్రమ్ కోబ్రా మూవీ నుంచి ఓ అప్‌డేట్ వచ్చేసింది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి విక్రమ్ ఫస్టులుక్ పోస్టర్ ను రేపు సాయంత్రం 5 గంటలకు వదలనున్నారు. వయకామ్ .. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ 25 వేషధారణల్లో కనిపించనుండటం ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X