విక్రమ్ కొత్త చిత్రం 'దేవుని పుత్రుడు'...డిటేల్స్

By Srikanya

విక్రమ్ త్వరలో దేవుని పుత్రుడు ('దైవమగన్") గా కనిపించనున్నాడు. తమిళంలో అనేక సూపర్ హిట్స్ ఇచ్చిన విజయ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ 'ఈ సినిమా గురించి చాలా రూమర్లు వచ్చాయి. ఐ యామ్ శామ్ అనే హాలీవుడ్ చిత్రం స్ఫూర్తితో ఈ చిత్రం రూపొందుతుందని, ఈ చిత్రం నుంచీ హీరోయిన్ అనుష్క తప్పుకుందంటూ రూమర్స్ వచ్చాయి. అయితే నేను ఈ కథను రెండేళ్ల క్రితమే తయారుచేసుకున్నాను. ఇది పూర్తిగా ప్రేమానుబంధాల ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రం. ఒక హార్ట్‌కు, బ్రెయిన్‌కుమధ్య జరిగే వార్ ఈ చిత్రం అని అంటున్నారు. అలాగే జాతీయ అవార్డు గ్రహీత విక్రమ్ లాంటి హీరోతో పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. ఇందులో విక్రమ్ మెంటలీ చాలెంజ్డ్ పర్సన్ గా నటిస్తున్నాడు. ఇతని భార్య జబ్బు మనిషట. ఈ పాత్రను తమిళ హీరోయిన్ అమల పౌల్ పోషిస్తోంది. విక్రమ్ లాయర్ గా అనుష్క నటిస్తోంది. ఒకేసారి తెలుగు, తమిళం భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X