నయనతార లక్కీ ఛాన్స్

నిజానికి 'మల్లన్న' (తమిళంలో 'కందసామి') సినిమా తర్వాత విక్రమ్ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తానని చెప్పాడు. ఆదీ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అని స్పష్టం చేసాడు. కాని ఇప్పడది మెటీరిలైజ్ అయ్యేట్లు కనపడటం లేదు. కారణం చెన్నైలో రిలీజయిన రోజే 'పరుగు' సినిమాను అతను చూసాడట. బాగా అసంతృప్తి చెందాడుట. భాస్కర్ ఆ చిత్రాన్ని రూపొందించిన తీరు నచ్చలేదని దగ్గరవాళ్ళ దగ్గర కామెంట్ చేసాడుట. అందుకే తెలుగు స్ట్రెయిట్ సినిమాను మరి కొంతకాలం వాయిదా వేసుకుందామనే నిర్చయనికి వచ్చాడుట. కె.యస్.రవి కుమార్ సినిమా జూన్‌లో లాంఛనంగా ప్రారంభం కానున్నది. ఆ తరువాత మణిరత్నం సినిమాలో విక్రమ్ చేస్తాడట. అంటే పరుగు పరాజయం నయనతార కి కలసి వచ్చినట్లే. ఆమెకు ఎప్పటినుంచో విక్రమ్ ప్రక్కన చేయాలని కోరికట. అదే విక్రమ్ భాస్కర్ సినిమా చేస్తే నయనకు ఆఫర్ వచ్చేదా అని ఆమె అభిమానులు అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











