twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విలన్ వేషాలు కోసం తిరిగే పాత్రలో స్టార్ హీరో

    By Srikanya
    |

    తను చేసే ప్రతీ పాత్ర డిఫెరెంట్ గా ఉండాలని కోరుకునే నటుడు విక్రమ్. ఆయన తాజాగా సినిమాల్లో విలన్ వేషాలు కోసం తిరిగే ఔత్సాహికుడుగా త్వరలో కనపించనున్నారు. తమిళ దర్శకుడు సుశీంద్రన్ రూపొందిస్తున్న ఈ చిత్రం సినీ పరిశ్రమ బ్యాక్ డ్రాప్ లో కథ జరగనుంది.ఇందులో దీక్షాసేధ్ పాత్ర కీలకంగా ఉండనుంది.అలాగే ఈ చిత్రంలో విక్రమ్ 14 గెటప్‌లలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.తెలుగులోనూ డబ్ చేసి ఒకేసారి విడుదల చేసారు. ఇక దర్శకుడుగా మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన దర్శకుడు సుశీంద్రన్. ఆయన దర్శకత్వ శైలి ప్రతి చిత్రానికీ కొత్తగా ఉంటుంది. వెన్నిలా కబడికుళు, నాన్ మహాన్ అల్ల, అళగర్ సామియన్ కుదిరై తదితర మూడు సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించారు.

    ప్రస్తుతం విక్రమ్ హీరోగా రాజపాట్టై చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దీక్షాసేథ్ తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ క్లైమాక్స్ ని ఎనిమిది రోజులు పాటు చిత్రీకరించారు. యవన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ కి విడుదల అవుతోంది. ఇక గతంలో విక్రమ్ నటించిన నాన్న చిత్రం కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు.విమర్శకుల ప్రశంసలు అందుకున్నా అనుకున్న రేంజిలో విక్రమ్ కి పేరు తేలేదు. దాంతో నిరాశలో ఉన్న విక్రమ్ ఈ చిత్రంపైనే పూర్తి దృష్టి పెట్టారు. ఇక దీక్షాసేధ్ విషయానికి వస్తే... గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న నిప్పులో కూడా ఆమె నటిస్తోంది. ఈ చిత్రాన్ని మరో దర్శకుడు వైవియస్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇక ఆమె నిప్పు లో కాకుండా ...లారెన్స్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా 'రెబల్‌" లక్ష్మిప్రసన్న నిర్మాతగా మనోజ్‌తో 'ఊ కొడతార ఉలిక్కి పడతారా" చిత్రాలలో నటిస్తోంది.

    English summary
    In Rajapattai movie Vikram plays the role of an aspiring villain. His character has a tinge of negative shades and the actor says that he is thoroughly enjoying doing it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X