For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంధుడి పాత్రలో విక్రమ్.. వివరాలు

    By Srikanya
    |

    చెన్నై : జాతీయ అవార్డు గ్రహీత విక్రమ్ త్వరలో అంధుడిగా తన నటనా విశ్వరూపం చూపించనున్నారు. తనతో నాన్న చిత్రం రూపొందించిన దర్శకుడు విజయ్ దర్సకత్వంలో రూపొందుతున్న శివ తాండవం చిత్రంలో విక్రమ్ విజువల్లీ ఛాలెంజెడ్ పాత్ర చేస్తున్నారు. విక్రమ్‌, జగపతిబాబు హీరోలుగా తేజ సినిమా పతాకాన విజయ్‌ దర్శ కత్వంలో సి. కళ్యాణ్‌ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం 'శివ తాండవం'. ఈ చిత్రంలో విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే రా ఏజెంట్ గానూ విక్రమ్ మరో పాత్రలో కనిపించనున్నారు.

    ఇక దర్శకుడు విజయ్ ఈ పాత్ర విషయమై మాట్లాడుతూ...విక్రమ్ పాత్రం..డానియల్ కిష్ చెప్పిన శభ్దాలతో చూడటం అనే అంశం మీద ఆధారపడి రూపొందించాం అన్నారు. అనుష్క, యామీ జాక్సన్‌, లక్ష్మీరాయ్‌, శరణ్య, సుజిత, కోట శ్రీని వాసరావు, నాజర్‌, సాయాజీ షిండే, ఎం.ఎం. భాస్కర్‌, ఢిల్లి గణేష్‌ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రం ఆడియో ఆగస్ట్‌ రెండవ వారంలో ఆవిష్కరించి, సెప్టెంబర్లో చిత్రాన్ని విడుదల చేస్తామని, ఇది తన 41వ చిత్రమని ఎక్కువ కేంద్రాల్లో విడుదల చేయదలచానని నిర్మాత సి. కళ్యాణ్‌ అన్నారు.

    నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'ఇందులో విక్రమ్ పూర్తి వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. గత చిత్రాలకు భిన్నంగా ఆయన పాత్ర చిత్రణ వుంటుంది. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాం. జగపతిబాబు పాత్ర సినిమాకు ప్రత్యేకార్షణగా నిలుస్తుంది. అత్యున్నత ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. జి.విపకాష్‌కుమార్ సంగీతాన్నందిస్తున్నాడు. ప్రస్తుతం లండన్‌లో చిత్రానికి సంబంధించిన నిర్మాణ కార్యక్షికమాలు జరుగుతున్నాయి' అన్నారు.

    షాయాజీ షిండే, నాజర్, కోట శ్రీనివాసరావు, శంతనమ్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. సెప్టెంబర్ 18న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విక్రమ్‌కి సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    Vikram is playing dual roles in AL Vijay’s upcoming bilingual film which is titled Shiva Thandavam in Telugu. He’ll be seen as a RAW agent, which is India’s external intelligence agency, and another role is making quite a lot of buzz in Tamil film industry. He’s reportedly playing the role of a visually challenged person who uses his sense of hearing to locate people.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X