మలయాళీ హిట్ 'ఉస్తాద్‌ హోటల్‌' రీమేక్‌లో ...

By Srikanya

Vikram Prabhu
చెన్నై : జోరుమీదున్న విక్రమ్‌ప్రభు మరో కొత్త చిత్రానికి పచ్చజెండా వూపారు. 'గుమ్కీ'తో తెరంగేట్రం చేసిన ప్రభు నట వారసుడు విక్రమ్‌ తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నారు. అలా ఆయనకు వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే శరవణన్‌ దర్శకత్వంలో ఆయన నటించిన 'ఇవన్‌ వేర మాదిరి' విడుదలైంది. 'అరిమానంబి' అనే మరో చిత్రంలో కూడా ఆయన నటిస్తున్నారు. మలయాళంలో ఘన విజయాన్ని నమోదు చేసిన 'ఉస్తాద్‌ హోటల్‌' రీమేక్‌లో నటించేందుకు ఆయన అంగీకరించారు.

'తలప్పాకట్టి' పేరుతో తెరకెక్కనున్న ఇందులో సీనియర్‌ నటుడు రాజ్‌కిరణ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం 'అరిమానంబి' చిత్రీకరణలో బిజీగా ఉన్న విక్రమ్‌ప్రభు అనంతరం నటించనున్న చిత్ర ఇదేనని ఆయన సన్నిహితవర్గాలు వెల్లడిస్తున్నాయి. పేరుకు మలయాళ రీమేక్‌ అయినా.. తమిళ వాతావరణానికి తగిన మార్పులు కూడా చేస్తున్నట్లు సమాచారం.

ఇక ప్రభు కుమారుడు విక్రంప్రభు హీరోగా నటించిన రెండోచిత్రం 'ఇవన్‌ వేరమాదిరి'. 'ఎంగేయుం ఎప్పోదుం' ఫేం శరవణన్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా విక్రంప్రభుకు పేరు తెచ్చిపెట్టింది. తిరుపతి బ్రదర్స్‌ బ్యానరుపై లింగుస్వామి నిర్మించిన ఈ సినిమాను సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాజాగా చూశి మెచ్చుకున్నారు. దాంతో హీరో విక్రం ప్రభు మురిసిపోతున్నాడు.

సినిమా చూసిన అనంతరం చిత్రయూనిట్‌ను మెచ్చుకున్నారు. అనంతరం విక్రంప్రభుకు ప్రశంసాపత్రాన్ని కూడా పంపించారట. 'ఇది క్లాస్‌, మాస్‌ కలగలసిన చిత్రం. ఏ సినిమాలోనూ లేని కీలక సన్నివేశాలు ఇందులో చూసి ఆశ్చర్యపోయా. మంచి కాలక్షేప చిత్రం కూడా. విజయవంతమైన ఈ సినిమాకు నా అభినందనలు తెలియజేస్తున్నాను''అని అందులో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X