'నాన్న' నిర్మాతలకు విక్రమ్ ట్విస్టు
విక్రమ్ తాజా చిత్రం నాన్న మొన్న శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా బావుందని,విక్రమ్ అద్బుతమైన నటన ప్రదర్శించాడని రివ్యూలు వచ్చినా దియోటర్స్ వద్ద జనం కనపడటం లేదు.దాంతో ఓపినింగ్స్ కూడా సరిగ్గా రాని ఈ చిత్రం తమకు ఏ విధమైన నష్టం తీసుకువస్తుందనో బెంగతో నాన్న నిర్మాతలు ఉన్నట్లు సమాచారం.దాదాపు నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి రీమేక్ రైట్స్ తీసుకున్న నిర్మాతలు విక్రమ్ ప్రమోషనల్ టూర్ కి వచ్చి తమని నిలబెడితే బావుంటుందని భావిస్తున్నారు.అయితే విక్రమ్ మాత్రం స్లో అండ్ స్టడీ స్కీమ్ ని ఫాలో అవుతున్నాడు.
సినిమా బాగుంది కదా అనవసరంగా పబ్లిసిటీ హైప్ ఎందుకన్నట్లు బిహేవ్ చేస్తున్నాడు.దాంతో తాము ఛానెల్స్ లోనూ, విజయయాత్రల్లోనూ,సక్సెస్ మీట్ ల్లోనూ హీరోని చూపి పబ్లిసిటీ చేద్దామనుకున్న నిర్మాతలు అవాక్కయ్యారు.సినిమా విడుదలకు రెండు నెలలు ముందు హైదరాబాద్ వచ్చి ప్రమోషన్ చేసి అమ్ముడుపోయాలా చేసిన విక్రమ్ ఆ తర్వాత కనిపించకపోవటాన్ని తప్పుపడుతున్నారు.అయితే ప్రస్తుతం విక్రమ్ దుబాయ్ లో షూటింగ్ లో ఉన్నాడు.అలాగే అనుష్కతో అయినా పబ్లిసిటీ క్యాపైన్ స్టార్ట్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











