twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విక్రమ్ ...అదరకొట్టాడు (కొత్త చిత్రం ఫస్ట్ లుక్)

    By Srikanya
    |

    చెన్నై : రీసెంట్ గా ...ఐ అంటూ చిత్రమైన బీస్ట్ గెడప్ లో అబ్బురపరిచిన హీరో విక్రమ్...ఈ సారి ఆ ఇమేజ్ కు పూర్తి భిన్నంగా గ్లామర్ గా కనిపించనున్నారు. విక్రమ్, సమంత జంటగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం '10 ఎన్రాదుకుల్ల'. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ..విక్రమ్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసారు. మీరు ఇక్కడ ఈ ఫస్ట్ లుక్ ను చూడవచ్చు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఈ పోస్టర్ లో ..విక్రమ్ చాలా స్టైలిష్ గా ..యంగ్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. డి.ఇమామ్ సంగీతం అందిస్తున్నాడు. మురగదాస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా మే నెలలో విడుదల చేస్తారు. ఈ ఫస్ట్ లుక్ పై మీ అభిప్రాయం కూడా క్రింద తెలియచేయండి.

    ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో డ్యుయల్ రోల్ లో కన్పించబోతోంద సమంత. 'పత్తు ఎంద్రాత్తుకుల్ల' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ వివిధ ప్రాంతాలలో సాగే ప్రయాణంగా ఉంటుందట. అలా నేపాల్ కి చెందిన ఓ గ్రామీణ యువతిగానే కాకుండా.. మోడ్రన్ గర్ల్ గానూ కనువిందు చేయబోతోందట.

    Vikram's ‘10 Enradhukulla’ First Look

    ఇక '10 ఎన్రాదుకుల్ల' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం ఛార్మీ సైన్ చేసింది. రెగ్యులర్ గా వచ్చే అన్ని సినిమాల్లోలా చేసే స్పెషల్ సాంగ్ లా కాకుండా కథలో భాగంగా బాగా నాటకీయంగా ఉండే ఈ ఛార్మీ స్పెషల్ సాంగ్ నిడివి 9 నిమిషాలు. అందుకే ఈ పాత కూడా సంథింగ్ స్పెషల్ గా ఉండాలని ఈ చిత్ర టీం పూణే దగ్గర లోని ఓ హిల్ ప్రాంతంలో ఓ భారీ సెట్ వేస్తున్నారు. ఆ సెట్ ని సుమారు 3 కోట్లు ఖర్చు పెట్టి రూపొందిస్తున్నారు. ఈ పాట కోసం ఛార్మి కు 30 లక్షలు పే చేస్తున్నట్లు తెలుస్తోంది.

    రోడ్ జర్నీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా సమ్మర్ చివర్లో రానుంది. ఓ కథని జడ్జిమెంట్ చేయటం ఎంత కష్టం...అందులో కోట్ల పెట్టుబడి, కెరీర్ ల మీద గేమ్ గా నడిచే సినిమా నిర్మాణంలో కీలకంగా నడిచే కథ అంటే చాలా చాలా కష్టం. అయితే తన కథని పది క్షణాల్లో హీరో విక్రమ్ ఓకే చేసారని గర్వంగా చెప్తున్నారు విజయ్ మిల్టన్. ఈ చిత్రాన్ని మురగదాస్ నిర్మించటం మరో విశేషం.

    సినిమాటోగ్రాఫర్‌గా పలు చిత్రాలకు పనిచేసిన విజయ్‌మిల్టన్‌ 'గోలిసోడా'తో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. చాలా తక్కువ బడ్జెట్‌లో చెన్నైలో సినిమాను తెరకెక్కించి.. భారీఎత్తున కలెక్షన్లు రాబట్టారు. ఏమాత్రం పెద్ద తారాగణం లేకుండా చిన్న పిల్లలతో సినిమాను తెరకెక్కించి విజయాన్ని అందుకున్నారు. ఆ వూపుతో ఉన్న విజయ్‌మిల్టన్‌ ఇటీవల ఓ కథను విక్రంకు చెప్పి వినిపించారు. కథ చెప్పిన పది క్షణాల్లోనే విక్రం ఓకే చెప్పారట. ఆ కథే ఇప్పుడు '10 ఎండ్రత్తుకుల్ల'గా తెరకెక్కుతోంది.

    విక్రంతో పరిచయం గురించి చెప్తూ... 'గోలిసోడా' చిత్రాన్ని సత్యం థియేటర్‌లో చూసి.. వెంటనే నాకు ఫోన్‌ చేశారు విక్రం. చాలా బాగుందని మెచ్చుకున్నారు. మరి నాకు ఏదైనా మంచి కథ ఉందా?.. అని ఆ రోజు అడిగారు. నేనస్సలు నమ్మలేకపోయా. తప్పకుండా చెబుతా సార్‌ అన్నా. అలా మా ఇద్దరి సినిమాకు ఆ మాటలే బీజం అని ఆనందంతో వివరించారు.

    విజయ్ మిల్టన్ మాట్లాడుతూ... దర్శకుడు కావాలన్నది నా ఆశ. కానీ చలనచిత్ర కళాశాలలో దర్శకత్వం కోర్సు చదవాలంటే డిగ్రీ తప్పనిసరి. కానీ అప్పట్లో కుటుంబ పరిస్థితుల దృష్ట్యా మూడేళ్లు చదివే అవకాశం కూడా లేదు. అందువల్ల ప్లస్‌టూ అర్హతతో ఛాయాగ్రాహకుడిగా చేరా. 1991లో కోర్సు పూర్తయ్యాక శక్తి శరవణన్‌, విన్సెంట్‌ సెల్వా వద్ద చేరా. అలా దాదాపు తొమ్మిది మంది వద్ద సహాయకుడిగా పని నేర్చుకున్నా. ఇప్పటి వరకు 25 చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశా. అన్ని సినిమాల్లోనూ దర్శకుడిగా నా ఆలోచన, పరిశీలనా దృష్టి మాత్రం ఉండేది అన్నారు.

    అలాగే...ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నప్పుడు 'కాదల్‌', 'దీపావళి', 'దయా', 'వనయుద్ధం', 'హలో'.. వంటి చిత్రాలు నాకు చాలా పాఠాలు నేర్పాయి. ఎన్నో విషయాలను తెలుసుకున్నా. ఈ సమయంలోనూ ఓవైపు కథలు కూడా రాసుకునేవాడిని. ఏదోఒక రోజు మెగాఫోన్‌ పట్టాలనే తహతహలాడా. నాటి అనుభవం, నా ఆశలతో 'గోలిసోడా'కు దర్శకుడినయ్యా అన్నారు.

    ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... 'గోలిసోడా' తర్వాత అంతకు మించిన చిత్రం తీయాలన్నది నా కోరిక. అలా '10 ఎండ్రత్తుకుల్ల' అనే కథను సిద్ధం చేసుకున్నా. తొలిసారి ఆ కథ వన్‌లైన్‌ను విక్రంకు ఫోనలో చెప్పా. వెంటనే ఇంటికి రమ్మని చెప్పారు. కథ చెప్పిన వెంటనే.. పదే పది క్షణాల్లో నటిస్తానని ఒప్పుకొని నాలో ఆనందాన్ని నింపారు. అదే వేగంతో చిత్రీకరణ కూడా పూర్తి చేశాం అని చెప్పుకొచ్చారు.

    English summary
    The first look of Vikram’s upcoming film 10 Enradhukulla was unveiled on the eve of Vikram’s birthday.Vikram looks super stylish and the first look poster is innovative with colorful design. 10 Enradhukulla is touted to be a road thriller.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X