ఆసక్తికరంగా ‘కోబ్రా’ టీజర్: అదిరిపోయే గెటప్‌తో అంచనాలు పెంచేస్తోన్న విక్రమ్

విలక్షణ నటనతో ఎంతో కాలంగా దక్షిణాదిలోనే బెస్ట్ యాక్టర్‌గా వెలుగొందుతోన్నాడు చియాన్ విక్రమ్. పేరుకు సీనియర్ హీరోనే అయినా.. కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కష్ట పడుతూ సత్తా చాటుతున్నారాయన. అదే సమయంలో సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతో కష్టాన్ని కూర్చి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసిన విక్రమ్.. తన పంథాను కొనసాగిస్తూ ప్రస్తుతం 'కోబ్రా' అనే సినిమాను చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది.

సైంటిఫిక్స్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న 'కోబ్రా'ను ఆర్.అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కిస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్‌లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలను చూపించారు. అలాగే, పలు రకాలుగా దర్శనమివ్వడంతో పాటు ఓ విచిత్రమైన గెటప్‌తో విక్రమ్ కనిపిస్తున్నాడు. ప్రతి వారికీ సమస్యలు వస్తుంటాయి.. వాటిన్నింటినీ గణితం ద్వారా పరిష్కారం చూపించవచ్చు అనే చెప్పే మ్యాథ‌మెటిషీయ‌న్‌గా విక్ర‌మ్ క‌నిపించాడు. ఈ టీజర్‌కు అస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత బలాన్ని అందించింది. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

Vikrams Cobra Official Teaser Released

ఇదిలా ఉండగా, గత క్రిస్మస్ సందర్భంగా 'కోబ్రా' నుంచి విక్రమ్‌కు సంబంధించిన మరో లుక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో విక్రమ్ షాకింగ్ లుక్‌లో కనిపించాడు. అతని సగం మెదడులో ఎన్నో అంకెలు, సమస్యలు ఉన్నట్లు చూపించారు. ఈ చిత్రంలో విక్రమ్ 20కి పైగా విభిన్న గెటప్‌ల్లో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ మూవీలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా కీలక పాత్రను పోషిస్తుండగా.. శ్రీనిధి శెట్టి, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X