విక్రమ్ కూతురు ప్రేమ వివాహం.. పెళ్లి చేసుకున్నది ఎవరినో తెలుసా?
Recommended Video

తమిళ సూపర్‌స్టార్, చియాన్ విక్రమ్ కూతురు అక్షిత వివాహం సోమవారం ఉదయం చెన్నైలో పెద్దల సమక్షంలో జరిగింది. కెవిన్‌కేర్ గ్రూప్ అధినేత సీకే రంగనాథన్ కుమారుడు రంజిత్‌తో అక్షిత వివాహం జరిగింది. విక్రమ్ అల్లుడు మను రంజిత్ డీఎంకే అధినేత ఎంకే కరుణానిధికి ముని మనువడు కావడం విశేషం. వీరి వివాహం కరుణానిధి నివాసంలో నిరాడంబరంగా జరగడం గమనార్హం.
పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం
గత కొద్దికాలంగా ప్రేమించుకొంటున్న అక్షిత, రంజిత్ .. డీఎంకే అధినేత కరుణానిధి ఎదుట ఒక్కటయ్యారు. చెన్నైలోని గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో ఈ వేడుక జరిగింది. కరుణానిధి ఎదుట అక్షిత మెడలో రంజిత్ మూడు ముడులు వేశాడు. ఈ వివాహం నేపథ్యంలో తమిళ సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు ఇరు కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు.

మంగళవారం చెన్నైలో రిసెప్షన్
తాజా వార్తల ప్రకారం.. అక్షిత, రంజిత్ వివాహ రిసెప్షన్ మంగళవారం చెన్నైలోని మేయర్ రామనాథన్ హాల్‌లో జరుగనున్నది. ఈ విందుకు దక్షిణాది సినీ, రాజకీయ, పారిశ్రామిక వర్గాలు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.
యువ దంపతులకు కరుణానిధి ఆశీస్సులు
విక్రమ్ కూతురు అక్షిత వివాహం కరుణానిధి మనవడు రంజిత్ జరిగింది. పెళ్లి తర్వాత వారు కరుణానిధి నుంచి ఆశీస్సులు తీసుకొంటున్న దృశ్యమిది అని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు శ్రీధర్ పిళ్లై ట్వీట్ చేశారు.

కొడుకు బాధ్యతను భుజాన
ఇదిలా ఉండగా, విక్రమ్ తండ్రిగా అనేక బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తన కూతురి పెళ్లి చేసిన విక్రమ్.. తన కుమారుడు ధ్రువ్ కెరీర్ బాధ్యతను తన భుజాన వేసుకొన్నాడు.

తమిళ అర్జున్ రెడ్డిగా ధ్రువ్
తెలుగులో ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రంతో ధ్రువ్ తమిళ సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి బాలా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సినిమాలతో విక్రమ్ బిజీ
విక్రమ్ కూడా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సామీ స్క్వేర్, ధ్రువ నక్షత్రం చిత్రాల షూటింగ్‌లో నిమగ్నమయ్యాడు. విక్రమ్ నటించిన స్కెచ్ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.


Click it and Unblock the Notifications











