కూతురు వెడ్డింగ్ రిసెప్షన్: సంతోషంతో హీరో విక్రమ్ ఇలా... (ఫోటోస్)
హీరో విక్రమ్ కూతురు వెడ్డింగ్ రిసెప్షన్ పాండిచ్చేరిలో జరిగింది. ఈ వేడుకకు ఫ్యాన్స్ భారీగా హాజరయ్యారు.
సౌతిండియాలో ప్రముఖ నటుల గురించి చెప్పుకుంటే అందులో టాప్ లిస్టులో ఉండే హీరో విక్రమ్. విక్రమ్ కూతురు అక్షిత వివాహం ఇటీవల చెన్నైలో జరిగింది. కరుణానిధి ముని మనవడు మనురంజిత్, అక్షిత ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుక చాలా సింపుల్‌గా జరింది.
అక్షిత-మనురంజిత్ వెడ్డింగ్ రిసెప్షన్ పాండిచ్చేరిలోని సంఘమిత్ర కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు.

వేల సంఖ్యలో అభిమానులు
అక్షిత-మనురంజిత్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు సౌత్ స్టేట్స్ నుండి దాదాపు 3 వేల మంది విక్రమ్ అభిమానులు హాజరయ్యారు. అభిమానుల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు.

పాట పాడిన విక్రమ్
ఈ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో అభిమానుల కోరిక మేరకు విక్రమ్ ‘హో బటర్‌ఫ్లై' అనే పాటను పాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
పాండిచ్చేరిలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. తమిళ సాంప్రదాయ వంటకాలతో పాటు స్పెషల్ డిషెస్ రెడీ చేశారు.

సినీ ఇండస్ట్రీ నుండి తక్కువే
వారం క్రితం జరిగిన పెళ్లి వేడుకతో పాటు, ఇపుడు జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ కు తమిళ సినీ పరిశ్రమ నుండి అతి కొద్ది మంది సెలబ్రిటీలు మాత్రమే హాజరు కావడం గమనార్హం.

ఆర్భాటాలు ఇష్టపడని విక్రమ్
నటుడు విక్రమ్ చాలా ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. తన సినిమా ఫంక్షన్స్ తప్ప ఆయన బయట ఎక్కువగా కనిపించరు. హంగులు, ఆర్భాటాలు పెద్దగా ఇష్టపడని విక్రమ్ కూతురు పెళ్లి వేడుక, వెడ్డింగ్ రిసెప్షన్ కూడా తన అభిచురుచికి తగినట్లుగా సింపుల్ గా పూర్తి చేశారు.


Click it and Unblock the Notifications











