శంకర్ 'ఐ'కోసం విక్రమ్ కొత్త గెటప్
చెన్నై : జాతీయ ఉత్తమనటుడు విక్రమ్ ప్రతీ చిత్రం,అందులో ప్రతీ సీన్,ముఖ్యంగా తన పాత్ర చాలా వైవిద్యంగా ఉండాలని కోరుకుంటారు. కథ కథకూ కొత్త ఆహార్యంతో కనిపించే కొద్దిమంది నటుల్లో విక్రమ్ ఒకరు. 'కాశి'లో అంధుడిగా, 'దిల్'లో పోలీసు అధికారిగా, 'అపరిచితుడు'లో మూడు వైవిధ్యపాత్రల్లో కనిపించి అలరించారాయన. ప్రస్తుతం తన తాజా చిత్రంలోనూ అదే తీరు కొనసాగిస్తున్నాడు. అపరిచితుడు తర్వాత శంకర్-విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఐ'. ఈ చిత్రంలో విక్రమ్ గెటప్ కి థియోటర్స్ లో క్లాప్స్ పడుతాయంటున్నారు. దర్శకుడు శంకర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయించి,రకరకలా స్టోరీ బోర్డులు వినియోగించి,ఫోటో షూట్ లు చేయించి ఈ గెటప్ ఫైనలజైజ్ చేసారని చెప్తున్నారు. ఈ గెటప్ లో పోనీ టెయిల్ తో విక్రమ్ తన ఫ్యాన్స్ కి పండుగ చేస్తాడంటున్నారు.
'ఐ'లో విక్రమ్ సరసన ఎమీ జాక్సన్ ఆడిపాడుతోంది. మలయాళ నటుడు సురేష్‌గోపి, హాస్య నటుడు సంతానం తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రెండో షెడ్యూల్‌ను ఇటీవలే చైనాలో పూర్తి చేసుకుని స్వదేశానికి చేరకుంది చిత్ర యూనిట్. 'ఐ'లో అదిరిపోయే పోరాట సన్నివేశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారట. ఆస్కార్ అవార్డు పొందిన చిత్రానికి స్టంట్స్ సమకూర్చిన యాన్ వూ పింగ్ స్టంట్ మాస్టర్‌గా వ్యవహరించారట. ఇంతటి శక్తిమంతమైన పోరాటాలకు తన దేహదారుఢ్యం కూడా అదేస్థాయిలో ఉండాలని భావించిన విక్రమ్ సిక్స్‌ప్యాక్‌కు మారాడట. ఈ వేషధారణ ప్రేక్షకులను తప్పక అలరిస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
మరో ప్రక్క ఈ చిత్రం ఓ చైనీస్ చిత్రం ఆధారంగా రూపొందుతోందని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆ రూమర్స్ ప్రకారం ఈ చిత్రం Running on Karma (2003)ఆనే చిత్రం ఆధారంగా రూపొందుతోంది. విక్రమ్, అమీ జాక్సన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంది. విక్రమ్, అమీ జాక్సన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకునిగా వ్యవహరిస్తున్నారు.
చైనీస్ చిత్రం కథ ప్రకారం..హీరో ఓ బౌధ్ద సన్యాసి. అతనికి ఇతరుల జీవితాల్లోకి చూడగలిగే వరం ఉంటుంది. అతను ఓ లేడీ పోలీస్ అధికారికి పరిచయమవుతాడు. ఆమె ఓ క్రిమినల్ ని పట్టుకోవాలనే ప్రయత్నంలో ఉంటుంది. ఆమెకు ఈ సన్యాసి తన శక్తులతో ఆ క్రిమినల్ ని పట్టుకోవటానికి సాయిం చేస్తాడు. అతను తన స్నేహితుడు మర్డర్ కి గురి అవటంతో తన ఆశ్రమం వదిలి బయిటకు వచ్చి ఆ కిల్లర్ ని పట్టుకోవాలని తిరుగుతున్నాడని ఆమెకు అర్దం అవుతుంది. అయితే ఆ పోలీస్ కూడా త్వరలో చనిపోవాలని రాసి పెట్టి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
రొమాంటిక్ యాక్షన్ ధ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ కి టైటిల్ గా 'మనోహరుడు'ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. తమిళంలో 'ఐ' అనే పేరుని ఖరారు చేశారు. తెలుగులో 'మనోహరుడు' అనే పేరుని నిర్ణయించారు. ఎ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రాహకుడు. ఈ చిత్రంలో మలయాళ హీరో సురేష్ గోపి ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











