రికార్డే మరి :యాభై లక్షల దాటిందీ ట్రైలర్

By Srikanya

చెన్నై : శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఐ' చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విక్రమ్ కు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. నెలక్రితం విడుదలైన 'ఐ' ట్రైలర్‌ ఎక్కువ హిట్లతో రికార్డు సృష్టించింది. ఆ రికార్డును అజిత్‌ నటించిన 'ఎన్నై అరిందాల్‌' ట్రైలర్‌ అధిగమించింది. ఈ నేపథ్యంలో నాలుగురోజుల క్రితం 'ఐ' థియేటర్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు శంకర్‌.

ప్రస్తుతం ఈ ట్రైలర్‌ ఇంటర్నెట్‌, యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో హవా చాటుకుంటోంది. ఇప్పటి వరకు ఏకంగా 5 మిలియన్ల మంది ట్రైలర్‌ను వీక్షించారు. ఇందులో విక్రం కనిపించే గెటప్‌ మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. రెండున్నర నిమిషాల ఈ ట్రైలర్‌లో గ్రాఫిక్‌ సన్నివేశాలు కూడా కనిపిస్తున్నాయి. అందువల్లే ట్రైలర్‌ను కూడా మళ్లీమళ్లీ చూస్తున్నారు జనాలు.

Vikram's 'I' Trailer Sets New Benchmark

''నేను ఇప్పటి వరకూ తెలుగులో సినిమా చేయలేదు. కేవలం నా సినిమాలన్నీ అనువాదాల రూపంలోనే తెలుగులో విడుదలయ్యాయి. అయినా సరే.. నన్నూ, నా చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. వారి కోసమైనా త్వరలో ఓ తెలుగు సినిమా చేస్తా'' అన్నారు ప్రముఖ దర్శకుడు శంకర్‌. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'ఐ'. విక్రమ్‌ హీరో . అమీజాక్సన్‌ హీరోయిన్. మెగా సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

Vikram's 'I' Trailer Sets New Benchmark

శంకర్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం అందరూ బాగా కష్టపడ్డారు. విక్రమ్‌ తన శక్తినంతా ధారబోశాడు. సన్నబడాలన్న ఆలోచన మాత్రం తనదే. నేను వద్దని చెప్పినా 'సార్‌.. నేను చేస్తా' అన్నాడు. ఏం చేసినా ఆరోగ్యం జాగ్రత్త అని సూచించా. సాధారణంగా నా సినిమాలో దృశ్యాలన్నీ దాచిపెడుతుంటా. కానీ ప్రచార చిత్రాల రూపంలో కొన్ని షాట్స్‌ చూపించా. అందుకే అంచనాలు ఎక్కువయ్యాయి. అయినా ఫర్వాలేదు.. వాటిని అందుకొనే సినిమా ఇది. పీసీ శ్రీరామ్‌తో ఎప్పటినుంచో రెండో సినిమా చేద్దామనుకొన్నా. కానీ ఇప్పటికి కుదిరింది. రెహమాన్‌ మళ్లీ నాకు అద్భుతమైన బాణీలు అందించారు. నిర్మాతని సంప్రదించినప్పుడు 'నేను చాలా సినిమాలు చేశా. కానీ మీతో సినిమా చాలా ప్రత్యేకంగా ఉండాలన్నా'రు.. ఆమాటే నాకు స్ఫూర్తినిచ్చింది. ఈ సినిమాకి విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌గా శ్రీనివాస్‌మోహన్‌ పనిచేశారు. '' అన్నారు.

Vikram's 'I' Trailer Sets New Benchmark

విక్రమ్‌ మాట్లాడుతూ ''నాకో మంచి టీమ్‌ దొరికింది. వాళ్ల సహకారంతోనే బరువు పెరిగా. తగ్గాను. రూపం మార్చుకోవడానికి ఎనిమిది నెలలు పట్టింది. చాలా కష్టమే. అయితే ఆసక్తిగా అనిపించి ఇష్టంగా చేశా. మేకప్‌ కోసం ఐదు గంటలు పట్టేది. తీసేయ్యడానికి మరో రెండు గంటలు పట్టేది. 'ఐ' కథ చెప్పినప్పుడే ఈ సినిమా కోసం ఏమైనా చేయాలనుకొన్నా. ఈ పాత్రలో అంత విషయం ఉంది. ఈ కథ నేనే కాదు, ఎవరు విన్నా ఇలానే కష్టపడతారు. నా వరకూ 'ఐ' ఒక కల. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ మూడేళ్లు కేటాయించాం. మరో సినిమా కూడా చేయలేదు. తెలుగు ప్రేక్షకులు ప్రపంచంలోనే ఉత్తమ ప్రేక్షకులు. ఎక్కడకు వెళ్లినా నేను ఇదే మాట చెబుతా. సినిమా అంటే అంత అభిమానం ఇక్కడి వాళ్లకు మరో మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X