విక్రమ్ సన్నగా 'ఐ'య్యాడు..పూర్తి డిటేల్స్
చెన్నై : శంకర్ దర్శకత్వంలో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం 'ఐ'. ఎమీ జాక్సన్ కథానాయిక. రాజు అనే అర్థంతో టైటిల్ పెట్టినట్టు సమాచారం. ఇటీవలే చైనాలో చిత్రీకరణ జరిగింది. ప్రస్తుతం కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సినిమా కోసం నటుడు విక్రమ్ వూహించని స్థాయిలో సన్నబడ్డాడు. పదహారేళ్ల యువకుడిలా.. నేటిశైలికి తగ్గట్టు శరీరాకృతిని మలచుకున్నాడు. తాజాగా విడుదలైన ఆయన ఫొటో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రథమార్థంలో సాధారణంగా కనిపించాడట. ద్వితీయార్థంలోని పాత్ర కోసం విక్రమ్ ఇలా మారాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం విక్రమ్ చాలా శ్రమించాడట. '84 కిలోల బరువుండే నేను ఈ పాత్ర కోసం 14 కిలోలు తగ్గానని' విక్రమ్ చెప్పాడు.
'అపరిచితుడు' లాంటి హిట్ తర్వాత హీరో విక్రమ్-ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'మనోహరుడు'. తమిళంలో 'ఐ' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో 'మనోహరుడు'గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఎంత సరికొత్తగా అంటే......అభిమానులు షాకయ్యేలా బక్కచిక్కిపోయి దర్శనం ఇవ్వనున్నాడు. తాజాగా విడుదలైన విక్రమ్ న్యూ లుక్ అభిమానులను ఉలిక్కిపడేలా చేసింది. అయితే దర్శకుడు శంకర్ మాత్రం సినిమా పాత్రకు సూటయ్యేందుకు ఇలాంటి లుక్ అంటున్నాడు.
సినిమాకు సంబంధించిన ఇతర వివరాల్లోకి వెళితే....ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17 భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహించిన రోబోను 9 భాషల్లో విడుదల చేశారు. ఇప్పుడు రజనీకాంత్ నటిస్తున్న కోచ్చడయాన్ ను 15 భాషల్లో విడుదల చేస్తున్నారు. ఆ సినిమాను మించి తన ఐను 17 భాషల్లో విడుదల చేయడానికి శంకర్ ప్లాన్ చేస్తున్నారట. ఆస్కార్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
బాడీ షేపింగ్, స్కానింగ్, మేకప్ లాంటి చాలా విషయాలకు ఎక్కువ సమయం తీసుకుంటోందట. విక్రమ్ ఈ సినిమా కోసం గతంలో ఏ సినిమాకూ లేని విధంగా చాలా ఎక్కువ శ్రమ పడుతున్నారట. ఈ చిత్రంలో విక్రమ్ సరసన అమీ జాక్సన్ హరోయిన్. ప్రముఖ సంగీత దర్శకడు రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసారు. పీసీ శ్రీరామ్ కెమెరామేన్. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేస్తారు. శుభతో కలిసి శంకర్ కూడా కథను రాశారు. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రానున్న ఈ సినిమాను అంతే అపురూపంగా నెక్స్ట్ లెవల్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారట శంకర్.


Click it and Unblock the Notifications












