శంకర్, విక్రమ్ ల ‘ఐ’లేటెస్ట్ ఇన్ఫో

By Srikanya

చెన్నై : ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రస్తుతం 'ఐ' అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం కాలీపాక్ దగ్గరలోని ఓ హాస్పటిల్ లో షూటింగ్ చేస్తున్నారు. అక్కడ ముప్పై రోజులు పాటు షూటింగ్ జరగనుంది. ఈ చిత్రంకోసం విక్రమ్...శరీరంలో చాలా మార్పులు చేసుకున్నారు. ఈ సినిమాలో విక్రమ్‌ కొన్ని ప్రయోగాలు చేశారు. పదిహేనేళ్ల బాలుడిగానూ, 85యేళ్ల వృద్ధుడిగానూ కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన తన దేహశైలిని కూడా మార్చుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఆయన ప్రత్యేకమైన కసరత్తులు చేశారు.

ఈ చిత్రంలో విక్రమ్...తమిళనాడు స్టేట్ భాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించనున్నాడని సమాచారం. . ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది 'ఐ' చిత్ర కథ అని వినపడుతోంది. అందుకోసం ఆయన ఎనిమిది కేజీలు పైగా బరువు తగ్గారు. ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఐ చిత్రం ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం. ఈ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని శంకర్ ఐ చిత్రాన్ని ఓ రేంజిలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది ఐ చిత్ర కథ అని వినపడుతోంది.

విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎమిజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. విక్రమ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'అపరిచితుడు' విడుదలై ఇప్పటికి దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది. చాలా విరామం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి 'ఐ' పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ చిత్రమంటేనే ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్. అందులో అపరిచితుడు కాంబినేషన్ రిపీట్ చేస్తూ చిత్రం రూపొందిస్తున్నాడంటే ఆ చిత్రం విశేషాలు తెలుసుకోవటానికి అందరకీ ఆసక్తే. ఈ నేపధ్యంలో ఈ రిపీట్ కాంబినేషన్ రూపొందిస్తున్న కొత్త చిత్రం ఐ చిత్రం కాన్సెప్ట్ లీక్ అయ్యిందంటూ చెన్నై ఫిల్మ్ సర్కిల్సో లో వినపడుతోంది.

త్రీ ఇడియట్స్ రీమేక్ చేసిన శంకర్ ఆ చిత్రం వర్కవుట్ కాకపోవటంతో ఈ సారి మళ్లీ తన రూట్ లోకే వెళ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీగా రూపొందే ఈ చిత్రం ఇప్పటివరకూ ఇండియన్ తెరపై ఎవరూ టచ్ చేయని సబ్జెక్టుతో నిండి ఉంటుందని చెప్తున్నారు. యాక్షన్,ఎంటర్టైనర్ తో మాస్ మసాలాగా ఉంటూనే సామాజిక సందేశంతో తయారు చేసిన ఈ స్క్రిప్టు దక్షిణాది భాషలకే కాక హిందీ వారిని సైతం అలరించేలా ప్లాన్ చేస్తున్నారు. సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌. ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X