twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విక్రమ్,సమంత చిత్రం షూటింగ్ మొదలైంది

    By Srikanya
    |

    ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ తాజా చిత్రం పేరు 'తేర్దల్'. అంటే తెలుగులో ఎన్నికలు అని అర్థం. విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ చిత్రంలో సమంత హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. గత శుక్రవారం ఈ చిత్రం షూటింగ్ హంగూ ఆర్బాటం లేకుండా ఆరంభమైందని సమాచారం. సినిమా టైటిల్ 'తేర్దల్' కాబట్టి, ఇది పొలిటికల్ డ్రామా అని చెప్తున్నారు. ఎన్నికల విధానంపై ఈ చిత్రం సాగుతుందని సమాచారం.

    దర్సకుడు శంకర్ కోరిక మీదట ఈ చిత్రానికి సమంత 180 రోజులు కేటాయించారు. ఆస్కార్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకునిగా వ్యవహరిస్తున్నారు. విక్రమ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'అపరిచితుడు' విడుదలై ఇప్పటికి దాదాపు ఏడేళ్లు అవుతోంది. చాలా విరామం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి 'తేర్దల్'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేస్తారు.

    త్రీ ఇడియట్స్ రీమేక్ చేసిన శంకర్ ఆ చిత్రం వర్కవుట్ కాకపోవటంతో ఈ సారి మళ్లీ తన రూట్ లోకే వెళ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీగా రూపొందే ఈ చిత్రం ఇప్పటివరకూ ఇండియన్ తెరపై ఎవరూ టచ్ చేయని సబ్జెక్టుతో నిండి ఉంటుందని చెప్తున్నారు. యాక్షన్,ఎంటర్టైనర్ తో మాస్ మసాలాగా ఉంటూనే సామాజిక సందేశం తో తయారు చేసిన ఈ స్క్రిప్టు దక్షిణాది భాషలకే కాక హిందీ వారిని సైతం అలరించేలా ప్లాన్ చేస్తున్నారు.

    ప్రస్తుతం సమంత చిత్రాలు వరుసగా రెడీ అవుతున్నాయి. నాగచైతన్య' ఆటోనగర్‌ సూర్య' ' రామ్‌ చరణ్‌ ' ఎవడు' మణిరత్నం ' కాదల్‌' గౌతమ్‌ మీనన్‌ ' ఎటు వెళ్లిపోయిందో మనసు' త్వరలో విడుదల కానున్నాయి. నిర్మాతలకు ఆమె మీద పెట్టుబడి పెడితే లాభాలకు ఇబ్బంది ఉండదనే నమ్మకం ఆమెను తమిళ,తెలుగు భాషల్లో బిజీ చేస్తోంది. ప్రస్తుతం ఆమె మహేష్ సరనస చేస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,సిద్దార్ద సరసన నందినీ రెడ్డి దర్శకత్వం షూటింగ్ లోనూ రెగ్యులర్ గా పాల్గొంటోంది. అడపా దడపా ఆమె యాడ్ ఫిల్మ్ లు కూడా చేస్తోంది.

    English summary
    
 Thendral is the upcoming directorial venture of Shankar, which has hit the floors on June 15. Samantha will be playing Vikram’s love lead in Thendral that is being themed on election system.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X