స్టార్ డైరక్టర్ శంకర్ నెక్ట్స్ ఆ హీరోతో ఖరారు
సౌతిండియా స్టార్ డైరక్టర్ శంకర్ తన తదుపరి చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. తాజాగా నన్భన్ చిత్రంతో భాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్న ఆయన నెక్ట్స్ చిత్రంలో విక్రమ్ ని హీరోగా ఎన్నుకున్నారు. గతంలో విక్రమ్ తో ఆయన అపరిచితుడు చిత్రం రూపొందించారు. మల్టి పర్శనాలిటీ డిజార్డర్ కంప్లైంట్ కి,సామాజిక అంశాన్ని కలిపి చేసిన ఆ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్టైంది. ఇప్పుడదే స్పూర్తితో మరో అద్బుతమైన కథతో ఆయన మరో చిత్రం రూపొందించనున్నారని తమిళ మీడియా అంటోంది.
ఇక ఈ చిత్రాన్ని ఎజియస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ చిత్రం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుంది. విక్రమ్ సైతం కమర్షియల్ హిట్ కు మొహం వాచి చాలా కాలం అయ్యింది. ఆయన సినిమాలు వస్తున్నాయి..పోతున్నాయి అన్నట్లు గా భాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. దాంతో ఈ కాంబినేషన్ పై ఆయన చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇక శంకర్ సైతం త్రి ఇడియట్స్ రీమేక్ కావంటంతో తన స్వంత కథతో మరో హిట్ కొట్టి తన అభిమానులను ఆనందపరచాలని ఉవ్విళ్లూరుతున్నారు.


Click it and Unblock the Notifications











