For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విక్రమ్ 'శివ తాండవం' రిలీజ్ తేదీ ఖరారు

    By Srikanya
    |

    చెన్నై: విక్రమ్‌, జగపతి బాబు హీరోలుగా తేజ సినిమా పతాకాన విజయ్‌ దర్శ కత్వంలో సి.కళ్యాణ్‌ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం 'శివ తాండవం'. ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడదల చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రంలో విక్రమ్ ఓ ఢిఫరెంట్ పాత్రలో రా ఆఫీసర్ గా కనిపించనున్నారు. అలాగే ఈ పాత్రకు ఉన్న మరో ప్రత్యేకత అంధుడిగా విక్రమ్ కనిపించటం. ఇక ఈ చిత్రం మరో ప్రత్యేకత ఏమిటీ అంటే..అనుష్క. ఆమె చిత్రం ప్లాష్ బ్యాక్ లో కనపడనుందని తెలుస్తోంది. ఇక మరో హీరోయిన్ గా చేస్తున్న అమీ జాక్సన్ పాత్ర హైలెట్ కానుంది.

    అమీ జాక్సన్ కి సంభందించిన సీన్స్ మొత్తం యు.ఎస్ లో చిత్రీకరించారు. అనుష్క ఎపిసోడ్ మొత్తం ఇండియాలో సాగుతుంది. చిత్రం కథ ఈ రెండు దేశాల్లో సాగుతుంది. ఈ చిత్రం స్టోరీ లైన్ గురించి దర్శకుడు ఎ.ఎల్ విజయ్ మాట్లాడుతూ..'అసాధారణ శక్తులున్న ఓ అంధుడి జీవిత కథే 'శివతాండవం. కాలగమనంలో కఠిన పరీక్షల్ని అతను ఎలా ఎదుర్కొన్నాడన్నదే చిత్ర ఇతివృత్తం. అతనిలో వున్న ఓ అసాధారణ శక్తి ఏమిటనేది సినిమాలో ఆసక్తికరమైన పాయింట్' అన్నారు.

    అలాగే జగపతి బాబు పాత్ర సినిమాకు ప్రత్యేకార్షణగా నిలుస్తుంది. ఇది తన 41వ చిత్రమని ఎక్కువ కేంద్రాల్లో విడుదల చేయదలచానని నిర్మాత సి. కళ్యాణ్‌ అన్నారు.ఈ చిత్రం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్షికమాలు జరుగుతున్నాయి. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'ప్రాణ వ్రపదంగా పెరిగిన ఇద్దరు మిత్రుల కథ ఇది. అధిక భాగం లండన్‌లో చిత్రీకరించాం. విక్రమ్ పాత్ర చిత్రణ సరికొత్త తరహాలో వుంటుంది. జగపతిబాబు కీలక పాత్రలో అలరిస్తారు. ఈ నెల రెండవ వారంలో పాటల్ని, సెప్టెంబర్ నెలాఖరులో సినిమాను విడుదల చేస్తాం' అన్నారు.

    అత్యున్నత ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. జి.విపకాష్‌ కుమార్ సంగీతాన్నందిస్తున్నాడు. ప్రస్తుతం లండన్‌లో చిత్రానికి సంబంధించిన నిర్మాణ కార్యక్షికమాలు జరుగుతున్నాయి' అన్నారు. షాయాజీ షిండే, నాజర్, కోట శ్రీనివాసరావు, శంతనమ్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. విక్రమ్‌కి సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనుష్క, యామీ జాక్సన్‌, లక్ష్మీరాయ్‌, శరణ్య, సుజిత, కోట శ్రీని వాసరావు, నాజర్‌, సాయాజీ షిండే, ఎం.ఎం. భాస్కర్‌, ఢిల్లి గణేష్‌ ముఖ్య పాత్రధారులు.

    English summary
    Vikram-starrer Shiva Thandavam (Thaandavam in Tamil) will be released on September 28. The film has Jagapathi Babu playing a role with negative shades. Vikram will play the role of a blind man, who practices the technique of human echolocation - a rare phenomenon in human beings with an ability to detect objects, their position and size by sensing echoes. The movie surely promises a good dosage of high voltage action scenes, romance and even comedy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X