Vikram trailer : దుమ్ము రేపేసిందిగా.. ఇంటెన్స్ యాక్షన్ తో అదరగొట్టిన ముగ్గురు స్టార్లు

విశ్వరూపం 2 సినిమా తరువాత కమల్‌హాసన్‌ కథానాయకుడిగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'విక్రమ్‌'. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే 'విక్రమ్‌' జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకురానుంది. అనిరుధ్‌ రవిచందర్‌ స్వరపరచిన ఈ సినిమాలోని 'పతళ పతళ' అనే తొలి గీతాన్ని ఇటీవల విడుదల చేశారు. ఈ పాటలో కమల్‌హాసన్‌ తనదైన శైలితో, స్టెప్పులతో అలరించారు. అయితే ఈ గీతానికి కమల్‌హాసన్‌ సాహిత్యాన్నందించడంతో పాటు స్వయంగా ఆలపించారు.

అయితే తాజాగా ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి విలన్ గా, ఫహద్‌ ఫాజిల్‌ పోలీస్‌ పాత్రలో నటిస్తున్నారు. ఇక ట్రైలర్ లో ఈ ముగ్గురు హీరోల లుక్స్‌, ఇంటెన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఈ సినిమా పూర్తి స్థాయి యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రూపొందినట్టు ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చింది.

ఇక ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈ సినిమాలో కమల్‌హాసన్‌ 'రా' ఏజెంట్‌గా కనిపించనున్నట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ లో ప్రతి సన్నివేశానికి తగినట్టుగా సంగీత సంచలనం అనిరుధ్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 'ఖైదీ', 'మాస్టర్‌' లాంటి హిట్ సినిమాల తర్వాత లోకేష్‌ దర్శకత్వం వహించిన సినిమా కావడం, సుమారు నాలుగేళ్ల తరువాత కమల్ హాసన్ తెర ముందుకు రానుండడమే కాక విజయ్ సేతుపతి విలన్ అని, ఫహద్ ఫాజిల్ పోలీస్ ఆఫీసర్ అని తేలింది. ఇది కాక ఈ సినిమాలో సూర్య కూడా అతిధి పాత్రలో నటించనున్నాడని తెలియడంతో 'విక్రమ్‌'పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

Vikram trailer : promises a gripping action thriller

ఇక ఈ ట్రైలర్‌ ఆ అంచనాలను మరింత పెంచేలా కట్ చేశారు. ఇక రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో కాళిదాస్‌ జయరామ్‌, నరైన్‌, అర్జున్‌దాస్‌, శివాని నారాయణన్‌ తదితరులు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు గిరీష్‌ గంగాధరన్‌ సినిమాటోగ్రఫీ అందించగా కమల్‌హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అన్నట్లు సూర్య నటిస్తున్న విషయం మీద కూడా ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'విక్రమ్' సినిమాలో తమిళ్ స్టార్ హీరో సూర్య కీలకమైన అతిథి పాత్రలో నటించబోతున్నారని ఆయన కథని మలుపుతిప్పే పాత్రలో కనిపిస్తారని చెప్పుకొచ్చారు. ఇక ఆయన క్యారెక్టర్ సినిమాకు మరింత స్పెషల్ అవుతుందని చెప్పడంతో సూర్య ఫాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X