Rajinikanth 170: సౌత్‌లో సెన్సేషనల్ కాంబో.. రజినీకాంత్‌కు విలన్‌గా సౌత్ స్టార్ హీరో
విలక్షణమైన నటనతో పాటు ప్రత్యకమైన మేనరిజంతో దాదాపు నాలుగు దశాబ్దాలుగా సౌతిండియాలోనే బడా సూపర్ స్టార్‌గా వెలుగొందుతోన్నారు రజినీకాంత్. ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గని ఆయన.. ఇప్పటికీ సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇలా గత ఏడాది 'అన్నత్తే' అనే సినిమాతో సందడి చేశారు. ఇక, ఇప్పుడేమో రజినీకాంత్.. నెల్సన్ దర్శకత్వంలో 'జైలర్' అనే సినిమాలో నటిస్తోన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ షూటింగ్ పూర్తైంది. ఆగస్టులోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
'జైలర్' మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ తన కొత్త సినిమాలను కూడా ఒక్కొక్కటిగా లైన్‌లో పెట్టుకుంటోన్నారు. ఇందులో భాగంగానే ఆయన తన 170వ చిత్రాన్ని 'జై భీమ్' ఫేం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్నారు. రెండు నెలల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. పైగా దీన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. అప్పటి నుంచి ఈ మూవీ గురించి ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తోన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దీని గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో విలన్‌గా ఓ స్టార్ హీరోను తీసుకుంటున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌ను ఈ చిత్రంలో విలన్‌గా నటించేందుకు ఒప్పించారని తాజాగా తెలిసింది. మొదట ఈ రోల్‌ను చేయడానికి సదరు స్టార్ హీరో నిరాకరించినా.. తర్వాత మనసు మార్చుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇక, ఇందులో విక్రమ్ పాత్ర రజినీకాంత్‌కు సమానమైన ప్రాధాన్యతతోనే ఉంటుందని తెలిసింది. వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్స్ అన్నీ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయని సమాచారం.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో టీజే జ్ఞానవేల్ రూపొందించే ఈ సినిమాను లైకా ప్రొడక్షన్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ పవర్‌ఫుల్ కాంబినేషన్‌పై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











