విక్రమ్ లేటెస్ట్' వీడింతే' కథ ఇదే

పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ కథను రెడీ చేసి తెరకెక్కించారు దర్శకుడు.అలాగే ఈ చిత్రంలో విక్రమ్ 14 గెటప్‌లలో కనిపించనున్నారు. ఇక దర్శకుడుగా మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన దర్శకుడు సుశీంద్రన్.ఆయన దర్శకత్వ శైలి ప్రతి చిత్రానికీ కొత్తగా ఉంటుంది.వెన్నిలా కబడికుళు, నాన్ మహాన్ అల్ల, అళగర్ సామియన్ కుదిరై తదితర మూడు సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించారు.
ఇక ఈ సినిమాని రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేస్తున్న సురేష్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అధినేత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ 'సుమారు 200కి పైగా ప్రింట్లతో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. విక్రమ్‌తో పాటు కె.విశ్వనాథ్ నటన అద్భుతంగా ఉంది. అలాగే యువన్‌శంకర్‌రాజా సంగీతం ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. పూర్తి హంగులతో తయారైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది' అన్నారు. శ్రియ, రీమాసేన్, సలోని కూడా నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: మది, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: సుశీంద్రన్.


Click it and Unblock the Notifications











