twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విక్రమ్ లేటెస్ట్' వీడింతే' కథ ఇదే

    By Srikanya
    |

    Vikram
    విక్రమ్, దీక్షా సేథ్ జంటగా పివిపి సినిమా పతాకంపై సుశీంద్రన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'వీడింతే' చిత్రం ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ చిత్రం పూర్తిగా హీరో మ్యానరిజమ్స్ పై అతని చుట్టూ తిరిగే కథతో తయారైంది. ఇందలో విక్రమ్ ఓ జిమ్ బోయ్ గా కనిపిస్తాడు. సినిమాల్లో స్టంట్ మ్యాన్ గా చేస్తూ ఎప్పటికైనా వెండితెరపై విలన్ గా ఎదగాలని అతని కోరిక. అతనికి దక్షిణామూర్తి (కె విశ్వనాధ్)పరిచయమవుతాడు. ఆయన కొడుకు చిదంబరం(అవినాష్) ఆయన్ని అడ్డం పెట్టుకుని పొలిటికల్ మైలేజ్ సంపాదించుకోవాలని చూస్తాడు. వాటి నుంచి విక్రమ్ సేవ్ చేస్తాడు. చిదంబరం తమ భూమిని రంగనాయకి(సనా)అనే మినిస్టర్ కి గిప్ట్ గా ఇచ్చి ఎమ్మల్యే అవ్వాలని చూస్తాడు. అది దక్షిణామూర్తికి ఇష్టం ఉండదు. ఆ స్ధలంలో ఆయన ఓ అనాధశరణాలయం నడుపుతూంటాడు. దాన్ని ఖాళీ చేయించి ఆక్రమించాలని రంగనాయకి,ఆమె వెనక ఉన్న ప్రదీప్ రావత్ అనే లాండ్ మాఫియా లార్డ్ కోరిక. దానికి విక్రమ్ ఎలా అడ్డుపడి న్యాయం చేసాడనేది మిగతా కథ.


    పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ కథను రెడీ చేసి తెరకెక్కించారు దర్శకుడు.అలాగే ఈ చిత్రంలో విక్రమ్ 14 గెటప్‌లలో కనిపించనున్నారు. ఇక దర్శకుడుగా మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన దర్శకుడు సుశీంద్రన్.ఆయన దర్శకత్వ శైలి ప్రతి చిత్రానికీ కొత్తగా ఉంటుంది.వెన్నిలా కబడికుళు, నాన్ మహాన్ అల్ల, అళగర్ సామియన్ కుదిరై తదితర మూడు సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించారు.

    ఇక ఈ సినిమాని రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేస్తున్న సురేష్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అధినేత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ 'సుమారు 200కి పైగా ప్రింట్లతో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. విక్రమ్‌తో పాటు కె.విశ్వనాథ్ నటన అద్భుతంగా ఉంది. అలాగే యువన్‌శంకర్‌రాజా సంగీతం ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. పూర్తి హంగులతో తయారైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది' అన్నారు. శ్రియ, రీమాసేన్, సలోని కూడా నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: మది, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: సుశీంద్రన్.

    English summary
    In Veedinthe movie Vikram plays the role of an aspiring villain. His character has a tinge of negative shades and the actor says that he is thoroughly enjoying doing it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X