For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరత్ కుమార్ కుమార్తెపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు విమల్.. హాట్ టాపిక్

|

సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ పై నటుడు విమల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముత్తుకుమారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త చిత్రం 'కాన్ని రాశి'లో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ పై నటుడు విమల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

వరలక్ష్మి శరత్ కుమార్ తో కలిసి నటించడం గురించి మాట్లాడిన విమల్.. తాను మొదటిసారి ఓ మగాడికి జోడీగా నటించానని విమల్ అనేయడంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే ఆ వెంటనే తనని తాను సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు విమల్. 'అంటే నా ఉద్దేశం అది కాదు. ఆమెతో కలిసి పనిచేయడంలో నాకు ఎలాంటి ఇబ్బందికి కలుగలేదు. ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా సహజంగా ఉంటుంది. కెమెరా ఆన్‌ అనగానే ఆమె వెంటనే పాత్రలో లీనమై పోయి సహజంగా నటిస్తుంది' అన్నాడు విమల్‌.

Vimal Shocking Comment On Varalaxmi Sarathkumar

ఇక ఇదే ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ తన పెళ్లి గురించి ఆసక్తికరంగా స్పందించడం మరో విశేషం. తాను ప్రేమ వివాహం చేసుకుంటానా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానా? అనే సంగతేమో గానీ అసలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా తనకు లేదని ఆమె తెలిపింది. దీంతో వరలక్ష్మి పెళ్లిపై కొంతకాలంగా చర్చలు నడుస్తున్నాయి. తమిళ హీరో విశాల్‌ను పెళ్లి చేసుకుంటారంటూ అప్పట్లో వార్తలు వస్తే వాటిని కొట్టిపారేసింది వరలక్ష్మి. ఈ నేపథ్యంలోనే తన ప్రేమ, పెళ్లికి సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలను ఎప్పటికప్పుడు ఫుల్ స్టాప్ పెడుతూ వస్తోంది వరలక్ష్మి శరత్ కుమార్.

English summary
Varalaxmi Sarathkumar, Vimal doing a new movie which is named as Kanni kashi. In this movie pramotions Vimal Commented On heroine Varalaxmi Sarathkumar.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more