Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శరత్ కుమార్ కుమార్తెపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు విమల్.. హాట్ టాపిక్
సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ పై నటుడు విమల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముత్తుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త చిత్రం 'కాన్ని రాశి'లో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ పై నటుడు విమల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
వరలక్ష్మి శరత్ కుమార్ తో కలిసి నటించడం గురించి మాట్లాడిన విమల్.. తాను మొదటిసారి ఓ మగాడికి జోడీగా నటించానని విమల్ అనేయడంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే ఆ వెంటనే తనని తాను సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు విమల్. 'అంటే నా ఉద్దేశం అది కాదు. ఆమెతో కలిసి పనిచేయడంలో నాకు ఎలాంటి ఇబ్బందికి కలుగలేదు. ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా సహజంగా ఉంటుంది. కెమెరా ఆన్ అనగానే ఆమె వెంటనే పాత్రలో లీనమై పోయి సహజంగా నటిస్తుంది' అన్నాడు విమల్.
ఇక ఇదే ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ తన పెళ్లి గురించి ఆసక్తికరంగా స్పందించడం మరో విశేషం. తాను ప్రేమ వివాహం చేసుకుంటానా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానా? అనే సంగతేమో గానీ అసలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా తనకు లేదని ఆమె తెలిపింది. దీంతో వరలక్ష్మి పెళ్లిపై కొంతకాలంగా చర్చలు నడుస్తున్నాయి. తమిళ హీరో విశాల్‌ను పెళ్లి చేసుకుంటారంటూ అప్పట్లో వార్తలు వస్తే వాటిని కొట్టిపారేసింది వరలక్ష్మి. ఈ నేపథ్యంలోనే తన ప్రేమ, పెళ్లికి సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలను ఎప్పటికప్పుడు ఫుల్ స్టాప్ పెడుతూ వస్తోంది వరలక్ష్మి శరత్ కుమార్.