For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విశాల్ ఆఫీస్ పై దాడి, హీరో కార్తి వార్నింగ్, లాఠీ ఛార్జీ

  By Srikanya
  |

  చెన్నై : విశాల్ కు, శరత్ కుమార్ కు మధ్య దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర సంఘం) నేపధ్యంలో ...గత కొన్ని నెలలుగా జరుగుతున్న గొడవ సర్దుమణిగినట్లే అయ్యి...మళ్లీ రాజుకుంది. దక్షిణ భారత సినిమా కళాకారుల సంఘం 'నడిగర్‌ సంఘం' సమావేశం సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని గొడవలకు దారి తీసితీసింది.

  నటీనటుల సంఘం 63వ సర్వసభ్య సమావేశాన్ని లయోలా కళాశాల ప్రాంగణంలో నిర్వహించాలని సంఘం తొలుత నిర్ణయించింది. కొన్ని కారణాల వల్ల సంఘం కార్యాలయ ప్రాంగణంలోనే నిర్వహించనున్నట్లు విశాల్‌ శనివారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.

  చెన్నైలో ఆదివారం ఈ సమావేశం నిర్వహిస్తున్న ప్రాంగణం బయట ఇరువర్గాలకు చెందిన పలువురు గొడవకు దిగారు. ఈఘటనలో ఓ నటుడి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.సంఘం నుంచి ఓ నటుడిని సస్పెండ్‌ చేసినందుకు నిరసనగా అతని మద్దతుదారులు ఆందోళనకు దిగారు. మరో వర్గం వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఘర్షణ చోటుచేసుకుంది.

  సమావేశం ప్రారంభవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. విశాల్ ఆఫీస్ పై దాడి జరిగింది, కార్తీ హెచ్చరించారు.. అసలేం జరిగింది, ఎవరి కారు అద్దాలు పగలకొట్టారు, అందుకు కారణాలేమిటినేది చూద్దాం.

  అనుమతి ఉన్నవారినే..

  అనుమతి ఉన్నవారినే..

  సమావేశం ఆదివారం మధ్యాహ్నం ఆరంభమైంది. ఈ నేపథ్యంలో గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లోపలకు అనుమతించారు. మీడియాకు కూడా అనుమతి నిరాకరించారు. ఈ తరుణంలో పాత నిర్వాహకుల మద్దతుదారులు పలువురు లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం ముదిరింది. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపు చేశారు.

  వారి మద్దతు దారులే గొడవ

  వారి మద్దతు దారులే గొడవ

  నటులు శరత్ కుమార్,రాధా రవిలను సస్పెండ్ చేస్తూ నడిగర్ సంఘం కార్యనిర్వాహక కమిటీ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే వారి మద్దతు దారులు ఆందోళనకు దిగారు. మరోవర్గం వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఘర్షణ చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

  ఎవరు కారు పై దాడి అంటే...

  ఎవరు కారు పై దాడి అంటే...

  దక్షిణ భారత సినిమా కళాకారుల సంఘం ‘నడిగర్ సంఘం' సమావేశం ప్రారంభమవుతున్న సమయంలోనే రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చెన్నైలో సమావేశం నిర్వహిస్తున్న ప్రాంగణం బయట ఈ స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.ఈ సంఘటనలో నటుడు కరుణాస్ కు చెందిన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

  ఇద్దరిపైనే వేటు

  ఇద్దరిపైనే వేటు

  దక్షిణ భారత చలన చిత్ర రంగంలో ప్రముఖులుగా ఉన్న శరతకుమార్, రాధారవిలకు నడిగర్ సంఘం నుంచి శాశ్వతంగా ఉద్వాసన పలికటం వారు సహించలేకపోయారు. ఆ ఇద్దరిపై వేటు వేస్తూ ఆదివారం జరిగిన నడిగర్‌సంఘం సర్వ సభ్య సమావేశంలో తీర్మానించారు. ఇక, ముష్టియుద్ధాలు, దాడులు, ప్రతి దాడుల నడుమ సమావేశ ప్రాంగణం వెలుపల ఉత్కంఠ నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి.

  ఓటమిపాలై

  ఓటమిపాలై

  గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో నటుడు విశాల్ వర్గం గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా ఓటమి పాలైన శరత్‌కుమార్ వర్గం సంఘ నిర్వాకంలో పలు అవకతవకలకు పాల్పడినట్లు అధికారం చేపట్టిన నూతన కార్యవర్గం ఆరోపణలు చేసింది.

  ట్రస్ట్ నిధి తినేసారు

  ట్రస్ట్ నిధి తినేసారు

  ముఖ్యంగా సంఘ ట్రస్ట్ నిధికి సంబంధించి పలు అక్రమాలు జరిగినట్లు పేర్కొంటూ దానికి ప్రధాన ట్రస్టీలుగా బాధ్యతలు నిర్వహించిన శరత్‌కుమార్, రాధారవిలను సంఘం నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రటించారు.

  విచారణలో ఉండగానే...

  విచారణలో ఉండగానే...

  ఈ విషయమై శరత్‌కుమార్ వర్గం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో ఉండగానే ఆదివారం స్థానిక టీనగర్, అబిబుల్లా రోడ్డులో గల సంఘ ఆవరణలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవిలను సంఘం సభ్యత్వం నుంచి శ్వాశతంగా ఉద్వాసన పలుకుతూ తీర్మానం చేశారు.

  వీళ్లందరికీ పురస్కారాలు...

  వీళ్లందరికీ పురస్కారాలు...

  సమావేశంలో భాగంగా సీనియర్‌ కళాకారులను ఘనంగా సన్మానించారు. అనంతరం ‘మక్కల్‌ తిలగం ఎంజీఆర్‌' అవార్డును సీనియర్‌ నటి బి.సరోజాదేవికి; ‘నడిగర్‌ తిలగం' పురస్కారాన్ని నటి కాంచనకు ఇచ్చారు. నటి ‘వూర్వశి' శారదకు ‘భానుమతి' అవార్డును అందజేశారు. అలాగే ‘స్వామి శంకరదాస్‌', ‘మనోరమ', ‘టీపీ రాజలక్ష్మి', ‘అంజలిదేవి'ల పేరిట కూడా అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు ఆనందం వ్యక్తం చేశారు.

  లెటర్ పంపుతాం త్వరలో

  లెటర్ పంపుతాం త్వరలో

  విశాల్‌ మాట్లాడుతూ.... ‘‘నటీనటుల సంఘంలో పలు అక్రమాలకు పాల్పడినందువల్లే శరత్‌కుమార్‌, రాధారవిలపై చర్యలు తీసుకున్నాం. దీనికి సంబంధించి సర్వసభ్య సమావేశంలో ఓ తీర్మానాన్ని కూడా నెరవేర్చాం. సంబంధిత లేఖను వారికి త్వరలో పంపిస్తాం. ఈ సమావేశం న్యాయస్థానం ఆదేశాల ప్రకారం జరిగింది అన్నారు.

  పోలీస్ వాళ్ల సాయింతో

  పోలీస్ వాళ్ల సాయింతో

  విశాల్ కంటిన్యూ చేస్తూ....ఇప్పుడు నా ఆఫీస్ పై రాళ్ల దాడి చేశారు. నా కారును కూడా ధ్వంసం చేశారు. నేను వాటి గురించి మాట్లాడదలచుకోలేదు. పోలీసుశాఖ సహకారంతో ఈ సమావేశం ఘనంగా జరిగింది అన్నారు.

  సంఘం పేరిట ఏకంగా..

  సంఘం పేరిట ఏకంగా..

  సంఘం పేరిట ఇప్పుడు ఏకంగా రూ.8.5 కోట్ల నిధిని సమకూర్చాం. త్వరలోనే భవన నిర్మాణం ఆరంభమవుతుంది. ఈ పని పూర్తయ్యాకే నా పెళ్లి జరుగుతుంద...అని విశాల్ పేర్కొన్నారు.

  వీరందిరినీ సత్కరించారు

  వీరందిరినీ సత్కరించారు

  అదే విధంగా తమిళసినిమా శతాబ్ది అవార్డులను నటి బీఎస్.సరోజా, చో.రామసామి, శ్రీకాంత్, చారుహాసన్, కే.పురట్చిరాణి, ఎంపీ.విల్వనాథన్, ఎంఆర్.కన్నన్, కేఎస్‌వీ.కనకాంబరం, టీఆర్.తిరునావక్కురసు. వి.రాజశేఖరన్, ఎంఎస్.జహంగీర్, ఏఆర్.శ్రీనివాసన్, టీఎస్.జోకర్‌మణి, ఆర్.శంకర్, జి.రామనాథన్, పదార్థం పొన్నుసామి, ఆర్.ఎన్.బాలదాసన్, సీఆర్.పార్తిబన్, ఆర్.గుణశేకరన్, ఎంఆర్.విశ్వనాథన్, జే.కమల, టీఎస్.రంగరాజ్, ఒరు ఇరవు. వసంతన్, టీఎస్‌కే.నటరాజ్, నాంజల్ నళిని, కేకే.జూడోరత్నం, పీ.సరస్వతి,కే. పన్నీర్‌సెల్వం మొదలగు వారికి అందించి సత్కరించారు.

  ఉద్రిక్త పరిస్దితి , అరెస్ట్

  ఉద్రిక్త పరిస్దితి , అరెస్ట్

  సంఘం నుంచి తొలగించబడిన సభ్యులు, వ్యతిరేక వర్గం తమను సమావేశంలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వాలంటూ సమావేవ వేదిక ముందు ఆందోళనకు దిగారు. కొందరు సంఘ సభ్యులు వారిని అడ్డుకునే ప్రయత్రంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది.ముష్టి యుద్ధాలకు దిగారు.పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేక పోవడంతో లాఠిచార్జి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆందోళన కారులను అరెస్ట్ చేశారు.

  రాళ్లతో దాడి

  రాళ్లతో దాడి

  అదే విధంగా సంఘ ఉపాధ్యక్షుడు, శాసనసభ్యుడు కరుణాస్ కారుపై ఆందోళన కారులు దాడి చేసి కారు అద్దాలను పగులగొట్టారు.ఇక్కడ ఇలా ఆందోళన జరుగుతుండగా సంఘం కార్యదర్శి విశాల్ ఆఫీస్ పై దాడి చేశారు. రాళ్లతో దాడి చేసి కార్యాలయం నిర్వాహకులను గాయపరచారు.

  మీటింగ్ అయ్యాక

  మీటింగ్ అయ్యాక

  కాగా ఇలా ఉద్రిక్త వాతావరణంలో సంఘం సర్వసభ్య సమావేశం పూర్తి చేసిన నిర్వాహకులు అనంతరం మీడియా సమావేశంలో శరత్‌కుమార్, రాధారవిల సభ్యత్వం నిరంతర రద్దును సమర్థించుకున్నారు.

  హెచ్చరిక...

  హెచ్చరిక...

  కోశాధికారి హీరో కార్తీ మాట్లాడుతూ.. గత నిర్వాకంలో సంఘ ట్రస్ట్‌కు తొమ్మింది మంది ట్రస్టీలు ఉండాల్సింది, శరత్‌కుమార్, రాధారవి మాత్రమే మొత్తం అధికారం ఉండేటట్లుగా వ్యవహరించి సంఘ నిధికి సంబంధించి పలు ఆక్రమాలకు పాల్పడట్టు లెక్కల్లో తేలిందన్నారు.అందుకే వారిపై వేటు వేసినట్లు వివరించారు.ఇకపై అవినీతిని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశం జరగనివ్వకుండా కొందరు కావాలనే ఆందోళనకు దిగారని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

  కోర్టులో తేల్చుకుంటాం...

  కోర్టులో తేల్చుకుంటాం...

  నడిగర్ సంఘం నుంచి శాశ్వతంగా రద్దు చేయడంపై రాధారవి స్పందిస్తూ నడిగర్ సంఘంలో మేము అన్నీ కరెక్ట్‌గానే చేశామని, సంఘం నుంచి తొలగించడంపై కోర్టులో తేల్చుకుంటామని అన్నారు.

  కార్తీ, విశాల్ కలిసి..

  కార్తీ, విశాల్ కలిసి..

  నటుడు, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ సంఘ భవన నిర్మాణ నిధి కొరకు ఒక చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఇంతకు ముందే వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో తాను, కార్తీ కలిసి నటించనున్నట్లు తెలిపారు.

  ప్రభుదేవా డైరక్షన్ లో..

  ప్రభుదేవా డైరక్షన్ లో..

  విశాల్ కలిసి చేయబోయే చిత్రానికి కథ ఏమిటి? దర్శకుడెవరు అనే విషయాలపై చాలా ఆసక్తి నెలకొంది. అలాంటి వాటన్నింటికి నటుడు విశాల్ క్లారిటీ ఇచ్చారు. తాను నటుడవుతానని చెప్పిన తొలి వ్యక్తి సుభాష్ అని, ఈ విషయాన్ని తానెప్పుడూ మరచి పోనని విశాల్ అన్నారు. సుభాష్ రాసిన చివరి కథ కరుప్పురాజా వెల్లైరాజాలో తాను, కార్తీ హీరోలుగా నటించనున్నామని, ప్రభుదేవా దీనికి దర్శకత్వం వహించనున్నారని పేర్కొన్నారు.

  వచ్చే జనవరికి...

  వచ్చే జనవరికి...

  విశాల్, కార్తీ కలిసి నటించనున్న మల్టీస్టారర్ చిత్రాన్ని విద్యాసంస్థల అధినేత, దేవి చిత్ర సహ నిర్మాత ఐసరి గణేశ్ నిర్మించనున్నట్లు టాక్. కరుప్పురాజా వెళ్లైరాజా అనే టైటిల్‌ను నిర్ణయించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభం కానుందని తెలిసింది. ఈ లోపు విశాల్, కార్తీ తాము అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసుకుంటారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

  English summary
  Violent clashes erupted between Sarthakumar and Vishal supporters at the annual general body meeting of Nadigar Sangam at Habibullah Road on Sunday, according to TV reports.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X