ఫుల్ స్పీడ్ మీదున్న విశాల్.. ఆర్యతో కలిసి మరోసారి మల్టీస్టారర్
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌కు తమిళ్‌లోనే కాకుండా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు నేపథ్యం ఉండటంతో ఇక్కడ కూడా భారీ క్రేజ్‌నే సొంతం చేసుకున్నాడు. డబ్బింగ్ సినిమాలే అయినప్పటికి స్ట్రెయిట్ సినిమా లెవెల్‌లో అదరగొడుతుంది. అభిమన్యుడు, డిటెక్టివ్ వంటి చిత్రాలతో ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నాడు. త్వరలోనే డిటెక్టివ్ సీక్వెల్ కూడా రాబోతోంది. ఈ మూవీ డైరెక్టర్ విషయంలో అప్పట్లో పెద్ద సెన్సేషనే జరిగింది.
డైరెక్టర్ మిస్కిన్‌ను తొలగించడం, మిగిలిన చిత్రాన్ని విశాల్ పూర్తి చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా డిటెక్టివ్ సీక్వెల్ రెడీ అవుతోంది. మరో వైపు చక్ర అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా మరో సినిమాను ప్రారంభించేశాడు. ఇందులో ఆర్య కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషించబోతోన్నాడు. ఇది వరకు వీరి కాంబినేషన్‌లో వాడు వీడు అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా మళ్లీ ఈ ఇద్దరూ కలిసి నటించబోతోన్నారు. ఈ మేరకు దర్శకుడు ఆనంద్ శంకర్ కొన్ని విషయాలను వెల్లడించాడు. ఆర్య విలన్‌గా నటించబోతోన్నాడు. ఓ హీరోయిన్‌గా మృనాళిని రవిని ఫిక్స్ చేశాం.. మరో ఫీమేల్ లేడీ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపాడు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు. ఇక ఇక్కడే కొన్ని రోజులు సినిమాను షూట్ చేయబోతోన్నామని యూనిట్ ప్రకటించింది.


Click it and Unblock the Notifications











