twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా నుంచి అలా కోలుకున్నాం.. విశాల్ వీడియో వైరల్

    |

    విశాల్‌కు, ఆయన తండ్రి జీకే రెడ్డి, వారి మేనేజర్‌కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. అయితే వారు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుని కరోనా నుంచి కోలుకున్నారు. మొదటగా విశాల్ తండ్రి జీకే రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక తండ్రికి సేవ చేస్తూ ఉండగా విశాల్‌లో కరోనా లక్షణాలు కనబడ్డాయట. టెస్ట్ చేయించుకుంటే.. తనకూ కరోనా పాజిటివ్ తేలిందట. తమతో పాటు ఉన్నందుకు మేనేజర్‌కు సైతం కరోనా సోకిందట. అయితే వీరంతా కరోనాను ఎలా జయించారో విశాల్ ఓ వీడియో ద్వారా వివరించాడు.

    విశాల్ వీడియో సారాంశం ఏంటేంట.. 'నాన్న గారికి జూన్‌లో క‌రోనా పాజిటీవ్ వ‌చ్చింద‌ని ఈ మ‌ధ్య కాలంలో ఒక వీడియో పెట్టాను. మా నాన్న గారికి 82 సంవ‌త్స‌రాలు. ఈ వ‌య‌సుతో ఆయ‌న‌ను హాస్ప‌ట‌ల్లో అడ్మిట్‌చేయాల‌నే ఆలోచ‌న అస్స‌లు లేదు. ఇందులో హాస్పిటల్స్‌ను కించపరిచే ఉద్దేశ్యం ఏమీ లేదు. ఇంట్లోనే ఉంచి ఆయ‌న‌ను బాగా చూసుకోవాల‌నేదే నా కోరిక. అందుకే నేనే దగ్గ‌రుండి ఆయ‌న‌ను చూసుకున్నాను. ఆ క్ర‌మంలో నాకు అవే ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. దాంతో టెస్ట్ చేయించుకుంటే నాకు క‌రోనా పాజిటీవ్ అని తేలింది. నాతో పాటు నాకు ద‌గ్గ‌ర‌గా ఉండే మా మేనేజ‌ర్ కి కూడా పాజిటీవ్ వ‌చ్చింది. మా అంకుల్‌ డాక్ట‌ర్ హరిశంకర్ గారి స‌‌మ‌క్షంలో మేము ఆయుర్వేదిక్‌, హోమియోప‌తి మెడిసిన్ తీసుకున్నాం.

    vishal ABout Corona Ayurvedic Treatment

    దీనికి ముందు మీకొక విష‌యం చెప్పాల‌నుకుంటున్నాను. ఈ కోవిడ్ స‌మ‌యంలో అన్నింటిక‌న్నా ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే మ‌నం వేసుకునే మందుల‌కంటే ముందు మ‌న‌లో భ‌యం ఉండ‌కూడ‌దు. ఆ భ‌యం చాలా అన‌ర్ధాల‌కు దారి తీస్తుంది. అందుక‌నే ముందు దైర్యంగా ఉండండి. మ‌నం త‌ప్ప‌కుండా ఈ వైర‌స్‌ని ఎదుర్కోగ‌లమని మ‌న మ‌న‌సులో త‌లుచుకోండి. ఈ ధైర్యం మా నాన్న‌గారి నుండి నాకు వ‌చ్చింది.

    అలాగే నా నుండి మా మేనేజ‌ర్ కి వ‌చ్చింది. ఆ దైర్య‌మే మమ్మ‌ల్ని మూడు వారాల్లో పూర్తిగా కోలుకునేలా చేసింది. అలాగే మా డాక్ట‌ర్ ఇచ్చిన మందులు కూడా మాకు హెల్ప్ అయ్యాయి. ముఖ్యంగా 82 సంవ‌త్స‌రాలున్న నాన్న గారికి చాలా హెల్ప్ అయింది. ఈ సంద‌ర్భంగా మా అంకుల్ డాక్ట‌ర్ హరి శంకర్ గారికి ద‌న్య‌వాదాల'ని తెలిపాడు. తాను వాడిన మందుల వివరాలను ట్విట్టర్‌లో అందుబాటులోనే ఉంచానని పేర్కొన్నాడు.

    English summary
    vishal ABout Corona Ayurvedic Treatment. He and His father Got Postive ANd Recovered From Covid 19. They Are Used Ayurvedic Treatment For Corona.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X