హీరోయిన్ తో నా ప్రేమ నిజమే కానీ...
చెన్నై: అది ఎప్పుడో ముగిసిన కథ. నేను నా ప్రేమ గురించి చెప్పిన వెంటనే ఫెయిల్ అయింది. ప్రపోజ్ చేశాక తను ఒప్పుకోలేదు. కానీ ఆ హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు అక్కర్లేదు. అది రహస్యంగానే ఉండిపోతే బాగుంటుంది అంటూ విశాల్ తన ప్రేమ గురించి చెప్పుకొచ్చారు. ఓ హీరోయిన్ ను ప్రేమిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి..ఈ విషయం మీడియావారు ప్రస్దావిస్తే ఇలా స్పందించారు.
లక్ష్మీమీనన్‌తో కలిపి వస్తున్న రూమర్స్ పై స్పందిస్తూ... అలాంటిదేం లేదండి. ఈ సినిమాలో లక్ష్మీమీనన్ నటిస్తేనే బాగుంటుందని అనుకున్నాం. ఆ తర్వాతే ఎంపిక చేశాం. 'పల్నాడు'లో ఆమె నటించారు. మా జంటకు మంచి మార్కులు వచ్చాయి. ఆ సెంటిమెంట్ అని కూడా చెప్పొచ్చు అన్నారు. వరలక్ష్మి, ఐశ్వర్య, ఇప్పుడు శ్రుతి..ఇలా వారసత్వ నటీమణులతో నటించటం గురించి చెప్తూ... ఇలా కూడా కనెక్ట్ చేస్తారా.. హరి దర్శకత్వంలోని సినిమాలో నటిస్తున్నా. అందులో శ్రుతిని హీరోయిన్‌గా ఎంచుకున్నారు. అంతేతప్ప.. మీరనుకుంటున్నట్లు కాదు. అంతా దర్శకుల నిర్ణయమే అన్నారు.
ఇక నటీనటుల సంఘ వ్యవహారం గురించి చెప్తూ... తప్పు అనిపించినందునే వారిని ప్రశ్నించా. అందుకు సమాధానం వచ్చిందే తప్ప.. పరిష్కారం కనిపించలేదు. ఇప్పటికీ నటీనటుల సంఘం సరైన రీతిలో నడవడంలేదనేది స్పష్టమవుతోంది అన్నారు. నేను నటించిన 'మదగజరాజ' కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పుడు.. విజయకాంత్ ఫోన్ చేసి ఓదార్చారు. ఆయన మాటల్లో ప్రేమ కనిపించింది. మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు కొన్ని టానిక్కులు మనకు ఉత్తేజాన్నిస్తాయి. అన్న మాటలు కూడా అలాగే అనిపించాయి. ఆ విషయంలో కెప్టెన్‌కు నేను కృతజ్ఞత చెప్పాల్సిందే.
ఆమ్‌ఆద్మీ పార్టీలో చేరనున్నారా అనే విషయం గురించి చెప్తూ... అసలు ఆ వార్తలు చదివాకే నేను చేరుతున్నట్లు తెలిసింది. ఓ భారతీయుడిగా చెప్పాలంటే.. రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ అది. మార్పును తీసుకొచ్చిందనే అనాలి. యువకులు రాజకీయాల్లోకి రావాలంటూ కృషి చేస్తోంది. మంచి విషయం. ఆ పార్టీ గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది. నేను హీరో అవుతానని కలలో కూడా ఊహించలేదు. దర్శకుడు అవ్వాలని మాత్రం అనుకున్నా. ఇప్పుడు నిర్మాతనయ్యా. రాజకీయాల్లోకి రావాలని ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచనా చేయలేదు. కానీ నేను రాజకీయాల్లోకి వస్తే తప్పేం కాదుగా? అన్నారు.


Click it and Unblock the Notifications












