హీరో విశాల్-అనీషా రెడ్డి పెళ్లి డేట్ ఫిక్స్ అయింది

Recommended Video

Vishal-Anisha Wedding Date Info || Filmibeat Telugu

తమిళ నటుడు విశాల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ అమ్మాయి అనీషారెడ్డితో మార్చి నెలలో అతడి ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విశాల్-అనీషా పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

అక్టోబర్ 9న పెళ్లి ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం. అయితే వెడ్డింగ్ సెర్మనీ హైదరాబాద్‌లో జరుగుతుందా? లేక చైన్నైలో జరుగుతుందా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే విశాల్ నుంచి ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Vishal and Anisha wedding date Oct 9th

నడిగర్ సంఘం(తమిళ నటీనటుల సంఘం) బిల్డింగ్ నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు తాను పెళ్లి చేసుకోను అంటూ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న విశాల్ గతంలో శపథం చేసిన సంగతి తెలిసిందే. బిల్డింగ్ నిర్మాణం పూర్తి కావడంతో పెళ్లికి సిద్ధమయ్యారు.

హైదరాబాద్‌లో బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అనీషా రెడ్డి ఇంతకు ముందు విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి' చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర పోషించింది. అయితే ఆమె యాక్టింగును అంత సీరియస్‌గా తీసుకోలేదు. విశాల్ పొడవుకు పర్ఫెక్టుగా సూటయ్యేలా అనీషా రెడ్డి తగిన జోడీలా ఉందని, చూడముచ్చటైన జంట అంటూ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా అనీషా మొదట తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా విశాల్‌తో పెళ్లి విషయం ప్రకటించారు. ఆ తర్వాత విశాల్ ట్వీట్ చేశారు. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. అనీషా తన లైఫ్‌లోకి రావడం పట్ల హ్యాపీగా ఉన్నట్లు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X